బాబు రాసిన లేఖపై షాకిచ్చిన జైలు అధికారులు
ఇంతలా లేఖ రాసిన తరువాత అది పూర్తిగా ఏపీ రాజకీయాలలో వైరల్ అయ్యాక చివరికి బాబు రాసిన లేఖతో మాకు సంబంధం లేదు అని జైలు అధికారులు పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు తల రాత ఏంటో అర్ధం కావడంలేదు. ఆయన జాతకం అసలు బాగాలేదు అనే అంటున్నారు. బాబు జైలు జీవితంలో అయినా సుఖంగా ఉన్నారా అంటే అదీ లేదు. ఆయన నలభై అయిదు రోజుల సుదీర్ఘ కాలం జైలు గోడల మధ్య నలిగిపోతున్నారు.
ఆ మీదట ఆయన ఒక లేఖ రాశారని బయటకు వచ్చింది. దాని నిండా ఎన్నో విశేషాలు, విశేషణలు ఉన్నాయి. అంతే కాదు, పదండి ముందుకు జయం మనదే అంటూ క్యాడర్ ని ఉత్సాహపరిచేలా ఉంది.
ఇంతలా లేఖ రాసిన తరువాత అది పూర్తిగా ఏపీ రాజకీయాలలో వైరల్ అయ్యాక చివరికి బాబు రాసిన లేఖతో మాకు సంబంధం లేదు అని జైలు అధికారులు పేర్కొన్నారు. మా నుంచి లేఖ రావాలంటే మా రాజముద్ర ఉండాలి. ముందుగా జైలులోని ఏ ముద్దాయి అయినా లేఖ రాసే ముందు మా అనుమతి తీసుకోవాలి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇక బాబు రాసిన లేఖ అయితే జైలు గోడల నుంచి రాలేదు అని అంటున్నారు. అది ఒక కరపత్రంగా పేర్కొంటున్నారు. జైలు నుంచి రాసే లేఖకు ముద్దాయి సంతకంతో పాటు జైలర్ దృవీకరించాల్సి ఉంటుందని, స్టాంప్
వేసి కోర్టులకు, ప్రభుత్వ అధికారులకు కుటుంబ సభ్యులకు ఇస్తారని పేర్కొంటున్నారు.
మరి ఈ లేఖ ఎలా వచ్చింది అంటే అక్కడే ఉంది ట్విస్ట్ అంటున్నారు. అభిమానులు ఎవరైనా లేఖను విడుదల చేసి బాబు పేరుతో సర్క్యులేట్ చేశారా అన్నది అనుమానంగా ఉంది. ఏది ఏమైనా వర్తమాన రాజకీయ పరిస్థితులు అన్నీ చెబుతూ బాబు ఈ లేఖను రాశారు. నారా భువనేశ్వరిని దీవించమని కోరారు. అలాగే పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. పాలకుల మీద ఘాటైన విమర్శలు చేశారు. సో ఈ లేఖ ఎక్కడ నుంచి వచ్చింది ఎలా వైరల్ అయింది అన్నది మాత్రం తెలియడంలేదు.
అయితే ఈ లేఖకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చేశారు. అలాగే మీడియాలో ఫుల్ ఫోకస్ అయింది. ఇంతకీ ఈ లేఖ ఎవరు రాశారు ఎలా బయటకు వచ్చింది అన్నది జైలు అధికారులు శోధించి చెబుతారా లేక మాకు సంబంధం లేదు అని మాత్రం చెప్పి ఊరుకుంటారా చూడాల్సి ఉంది.