జమిలి ఎన్నికలు వైసీపీకి టఫ్ జాబ్ ?

వైసీపీ ఎన్నికలు ఎపుడు వచ్చినా అధికారంలోకి వస్తామని చెబుతోంది కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూస్తే అలా అనిపించడం లేదు అని అంటున్నారు.

Update: 2024-10-16 12:30 GMT

వైసీపీ ఎన్నికలు ఎపుడు వచ్చినా అధికారంలోకి వస్తామని చెబుతోంది. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూస్తే అలా అనిపించడం లేదు అని అంటున్నారు. ఏపీలో సామాజిక వర్గాల పరంగా చూసినా రాజకీయంగా చూసుకున్నా ఎన్నడూ లేని విధంగా టీడీపీ కూటమి అత్యంత బలంగా ఉంది.

ఏపీలో రాజకీయాన్ని మలుపు తిప్పే కీలకమైన ప్రధానమైన సామాజిక వర్గాలన్నీ కూటమి వైపే ఉన్నాయి. ఏపీలో వైసీపీ ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ 2024 ఎన్నికల్లో చాలా వరకూ చెదిరిపోయింది అన్నది ఫలితాలను బట్టి అర్ధం అయింది అంటున్నారు.

ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా వైసీపీ వైపు పూర్తిగా చూడలేదు అని అంటున్నారు. ఆ వర్గాలు చూస్తే కనుక వైసీపీకి కచ్చితంగా ముప్పయి నుంచి నలభై స్థానాల దాకా వచ్చేవి అని గుర్తు చేస్తున్నారు. ఆ వర్గాలు టీడీపీ కూటమిని నమ్మాయని అదే సమయంలో కొంత కాంగ్రెస్ కూడా చీల్చిందని చెబుతున్నారు

ఇక ఉన్నత వర్గాలు అగ్రవర్ణాలు బీజేపీ వైపు మళ్లారు. అలాగే కాపులు జనసేనతో ర్యాలీ అయితే కమ్మలు బీసీలు టీడీపీని అట్టిపెట్టుకొని ఉన్నారు. టీడీపీ కూటమిలో ఈ మూడు పార్టీలు ఉండడంతో సామాజిక సమీకరణల విషయంలో వైసీపీ వైపు కలసి వచ్చే ఇప్పట్లో ఆ వర్గాలు టర్న్ అయ్యేది ఉంటుందా అన్నది ఒక చర్చ.

మరో వైపు చూస్తే చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ కూటమి సాగుతోంది. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే పాలన సాగుతోంది. ఈ ఇద్దరూ రాజకీయంగా కడు సమర్ధులు. సరైన సమయం సందర్భం చూడకుండా జమిలి ఎన్నికలను వారు కోరుకోరు.

జమిలి ఎన్నికలు వస్తే కనుక జాతీయ రాజకీయాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఏపీలో కూటమికి అది ప్లస్ అవుతుంది అన్న లెక్కలు ఉన్నాయి. దానికి తోడు అంగబలం అర్ధబలం అధికార బలం అన్నీ తోడై టీడీపీ కూటమి ముందుకు వస్తే గట్టిగా ఎదుర్కొనే సామర్థ్యం వైసీపీకి ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఓటమి తరువాత నాలుగైదు నెలలు గడచినా వైసీపీలో నిస్తేజం వెంటాడుతోంది. దాదాపుగా వంద నియోజకవర్గాలలో అభ్యర్ధులను మార్చేసి కొత్త వారిని పెట్టారు. దాంతో పాతవారు అలిగి వెళ్ళిపోయారు కొందరు పార్టీని వీడారు. ఇక కొత్త వారు అయితే ఉన్నారో లేరో అన్నది తెలియడం లేదు. టోటల్ గా చూస్తే సీనియర్లు వేరే ఆలోచనలు చేస్తూంటే జూనియర్లు సైలెంట్ గా ఉంటున్నారు.

ఈ రోజున ఏపీలో మొత్తం 175 సీట్లకు బలమైన అభ్యర్ధులు వైసీపీకి ఉన్నారా అన్నది కూడా చర్చగా ఉంది. అధికారంలో ఉన్నపుడే పాతిక ఎంపీ సీట్లలో గట్టి అభ్యర్ధులు దొరకక వైసీపీ ఇబ్బంది పడింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చాలా మార్పులు చేసుకుంది.

ఇపుడు అధికారమూ పోయి ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా అసలు జనంలోకి రాని అధినాయకత్వం నిస్తేజంలో కేడర్ ఇవన్నీ చూస్తూంటే జమిలి ఎన్నికలు వైసీపీకే ఎక్కువ షాక్ ఇస్తాయని అంటున్నారు. అయిదేళ్ల పాటు చంద్రబాబు పాలిస్తే గతంలో చివరాఖరులో వ్యతిరేకత వచ్చింది.

ఇపుడు మూడేళ్ళకే జమిలి ఎన్నికలు అంటే అధికార పార్టీ మీద తక్కువలో తక్కువ యాంటీ ఇంకెంబెన్సీ వస్తుంది దానిని ఎలా ఒవర్ కం చేయాలో చంద్రబాబుకు బాగానే తెలుసు అని అంటున్నారు. ఎన్నికలు అంటే ప్రతిపక్షానికి సంబరమే కానీ అదే సమయంలో టఫ్ జాబ్ అని అంటున్నారు

అన్ని బలాలు దగ్గర ఉంచుకున్న అధికార పక్షానికి ఈ విషయంలో అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. కేంద్రం సహకారం కూడా జమిలి ఎన్నికల్లో మరోసారి కూటమికి దక్కబోతోంది అని అంటున్న వేళ వైసీపీకి జమిలి ఎన్నికలు నిజంగానే పెను సవాల్ అని అంటున్నారు.

ఇప్పటి నుండీ పార్టీని గట్టిగా పటిష్టం చేసుకుని ఉన్న నేతలను కాపాడుకుంటూ పార్టీకి కొత్త ఉత్తేజాన్ని తేవాల్సి ఉంది. లేకపోతే మాత్రం ఈ ఎన్నికలు వైసీపీకి అగ్ని పరీక్షగా మారుతాయని అంటున్నారు. పొరపాటున జమిలి ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల పరిస్థితులు వస్తే మళ్లీ 2032లోనే ఎన్నికలు అప్పటికి రాజు ఎవరో మంత్రి ఎవరో అన్నాది కూడా అర్ధం కాదని అంటున్నారు. సో ఎన్నికలు ముందుగా వస్తున్నాయని సంబరం కాదని తాము ఎంతవరకూ ప్రిపేర్ అయ్యామన్నదే ముఖ్యమని అంటున్నారు.

Tags:    

Similar News