మంత్రి వర్గం రేసులో జనసేన లీడర్లు... లక్ ఎవరికో..!
వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి ముందుకు సాగాలని నిర్ణయించిన విషయం తెలి సిందే. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య టికెట్ల విషయం హాట్ హాట్‌గా సాగుతోంది.
వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి ముందుకు సాగాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య టికెట్ల విషయం హాట్ హాట్‌గా సాగుతోంది. సంఖ్యలు, అంకెలు.. ఇంకా తేలలేదు. కానీ, నాయకులు మాత్రం పట్టుబడుతున్నారు. చీరాలను ఆమంచి స్వాములుకు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై చంద్రబాబు కూడా చూచాయగా క్లారిటీ ఇచ్చేశారు. తాజా బాపట్ల పర్యటనలో ఈ నియోజకవర్గంపై ఎవరూ మాట్లాడొద్దని తేల్చి చెప్పారు.
సో.. చీరాల టికెట్ జనసేనకు కన్ఫర్మ్ అయినట్టేననే చర్చ సాగుతోంది. ఇక, రాజమండ్రి రూరల్ టికెట్ ను కందుల దుర్గేష్‌కు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని పోతిన మహేష్‌కు కేటాయించేశారని సమా చారం. అదేసమయంలో అనంతపురం అర్బన్ టికెట్ కూడా.. జనసేన ఖాతాలో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక, కర్నూలు ఎంపీ టికెట్ ను కూడా జనసేనకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. తెనాలి అసెంబ్లీ టికెట్‌ను నాదెండ్ల మనోహర్‌కు కేటాయించేశారనే ప్రచారం ఉంది.
అదేవిధంగా కాకినాడ రూరల్ టికెట్‌ను నాగబాబుకు ఇస్తున్నారని ఇక్కడ కార్యకర్తలు చెబుతున్నారు. మొత్తంగా టికెట్ల విషయం ఒకవైపు హాట్ హాట్‌గా ఉండగానే.. జనసేన నుంచి ఇద్దరు మంత్రులు కానున్నా రనే ప్రచారం కూడా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గెలిచేందుకు మంత్రి పీఠాలపై నా ఒక క్లారిటీ రావాల్సి ఉందని.. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రచారం చేసుకోవాలని సచూస్తున్నారు.
ముఖ్యంగా పవన్ అభిమానుల్లోకి మంత్రుల విషయాన్ని బలంగా తీసుకువెళ్లడం ద్వారా ప్రజలను తమ వైపు తిప్పుకొనేందుకు అవకాశం ఉంటుందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రుల రేసులో కందుల దుర్గేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదేసమయంలో నాదెండ్ల మనోహర్‌కు స్పీకర్ పోస్టును ఇస్తారని కూడా అంటున్నారు. ఇక, నాగబాబుకు కూడా కీలక పదవిని అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి మంత్రుల రేసులో అయితే.. జనసైనికుల పేర్లు రెండు మూడు వినిపిస్తున్నా కందుల దుర్గేష్ పేరు మాత్రం ప్రధానంగా చర్చకు వస్తుండడం గమనార్హం.