ఆ రెండు లేకుండానే.. జనసేనలో చర్చ!
అయితే.. ఆ రెండు కీలక విషయాలు, ఇరు పార్టీల నాయకులు ఎక్స్‌పెక్ట్ చేసిన అంశాలు తప్ప.. అన్నట్టుగా జెండా సభ ముందుకు సాగింది.
టీడీపీ-జనసేనలు నిర్వహించిన సంయుక్త జెండా సభపై ఆశలు నెరవేరాయా? అసలు ఈ సభ ఉద్దేశం ఏం టి? అనే విషయం చర్చకు వస్తోంది. ప్రధానంగా రెండు కీలక విషయాలు ఈ జెండా సభ ద్వారా ప్రస్తావనకు వస్తాయని టీడీపీ, జనసేన నాయకులు భావించారు. అయితే.. ఆ రెండు కీలక విషయాలు, ఇరు పార్టీల నాయకులు ఎక్స్‌పెక్ట్ చేసిన అంశాలు తప్ప.. అన్నట్టుగా జెండా సభ ముందుకు సాగింది. అరుపులు, గద్దింపులు, వార్నింగులు, ఒకింత ఆవేశాన్ని కలిపి జెండా సభను ముగించారు.
కానీ, వాస్తవానికి ఇలాంటి భారీ సభలు పెట్టినప్పుడు.. కార్యకర్తలు, నాయకులు, ఆయా సామాజిక వర్గాల అభి ప్రాయాలను ప్రతిబింబించేలా సభలో నాయకులు వ్యవహరించి ఉంటే.. మరింత వన్నె తెచ్చి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ దిశగా అయితే.. ఇరు పార్టీలనాయకులు ముందుకు అడుగులు వేయలే దు. దీంతో సభకు వచ్చిన ఇరు పక్షాల ముఖ్య నేతలు కూడా దీనిపై చర్చించుకోవడం క్షేత్రస్థాయిలోనే కనిపించింది. ఈ రెండు సమస్యలు పరిష్కరిస్తే.. బాగుండేదనే వాదన వినిపించింది.
1) సీట్ల పెంపు: జనసేన-టీడీపీ సంయుక్తంగా ముందుకు సాగుతున్న క్రమంలో టీడీపీ నుంచి జనసేనకు 24 సీట్లు మాత్రమే దక్కాయి. దీనిపై క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు, కాపు సామాజిక వర్గం కూడా ఆవేద న, ఆందోళనగా ఉన్నాయి. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా మరో 57 సీట్లను ప్రకటించాల్సి ఉందని.. కాబట్టి తమకు 10 సీట్ల వరకు దక్కవని జనసేన నాయకులు పలు టీవీ చానెళ్ల చర్చల్లో చెప్పారు. దీంతో సభలో ఈ ప్రస్తావన వస్తుందని జనసైనికులు భావించారు. కానీ, ఇది రాలేదు.
2) ఉమ్మడి మేనిఫెస్టో: టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను.. తాడేపల్లి గూడెం సభలో ఇరు పార్టీల అధినేతలు ఆవిష్కరస్తారని.... టీడీపీ నేతలు, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా.. గత రెండు రోజులుగా చెప్పుకొచ్చారు. ప్రజలకు తాము ఏం చేయాలని అనుకున్నామో.. తాడేపల్లి గూడెం వేదికగా వెల్లడిస్తామన్నారు. దీంతో దీనిపైనా జనసేన నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇది కూడా సాకారం కాలేదు. దీంతో ఈ రెండు సమస్యల ప్రస్తావన లేకుండా జెండా ముగిసింది.