పవన్ ను లైట్ తీసుకుంటున్నారా...?

అయితే మొదట్లో పవన్ స్టేట్మెంట్స్ కి కౌంటర్లు వరసబెట్టి వేసిన వైసీపీ ఆ తరువాత తగ్గుతూ వస్తోంది. పవన్ రోజూ ఏదో ఒక చోట తిరుగుతున్నారు.

Update: 2023-08-17 02:45 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారి సౌండ్ చేస్తే ఎన్నో గొంతులు అవతల నుంచి రీ సౌండ్ చేస్తూ ఉండేవి. అలాంటిది పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో రోజుల తరబడి జనంలో ఉంటే ఇక వైసీపీకి చేతి నిండా పనే అని ఎకసెక్కం ఆడేవారు గతంలో. తీరా చూస్తే ఒకటో యాత్ర సందర్భంలో వైసీపీ నుంచి బాగానే రీ సౌండ్ వచ్చింది. మధ్యలో ముద్రగడ పద్మనాభం తోడు అయ్యారు. దాంతో రాజకీయం రక్తి కట్టేసింది.

రెండవ విడత వారాహి యాత్రలో వాలంటీర్ల మీద పేలిన బాంబుతో సీఎం లెవెల్ దాకా కూడా ప్రకంపనలు వచ్చాయి. ఆ తరువాత మూడవ విడత యాత్ర విశాఖలో సాగుతోంది. నిజం చెప్పాలంటే కొంత చప్పగా సాగుతోందా అన్న భావన ఉంది. పేరుకు వారాహి యాత్ర కానీ పవన్ రెండే రెండు మీటింగ్స్ చేసారు. అందులో ఒకటి విశాఖ, రెండు గాజువాక. రెండూ సూపర్ హిట్ అయ్యాయి.

అయితే మధ్యలో వారాహి వదిలేసి పవన్ కారుతో తిరిగినవే ఎక్కువ. ఆయన వైసీపీ అక్రమాలు ప్రకృతి విద్వంసం అంటూ రుషికొండతో మొదలెట్టి విశాఖ ఎంపీ ఎంవీవీ నిర్మాణాలంతో ముందుకు సాగి అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమరానధ్ ఏరియాలో అక్రమ కట్టడాలు అంటూ జోరు చేసి ఎర్ర మన్ను దిబ్బల వద్ద గర్జించారు.

అయితే మొదట్లో పవన్ స్టేట్మెంట్స్ కి కౌంటర్లు వరసబెట్టి వేసిన వైసీపీ ఆ తరువాత తగ్గుతూ వస్తోంది. పవన్ రోజూ ఏదో ఒక చోట తిరుగుతున్నారు. కామెంట్స్ చేస్తున్నారు. ఆఖరుకు స్వాతంత్ర దినోత్సవం వేళ కూడా ఆయన విమర్శలు చేశారు. దాంతో పవన్ చేస్తున్న ఆరోపణలనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అని వైసీపీ భావిస్తొంది అంటున్నారు.

ఇక పవన్ సీరియస్ పొలిటీషియన్ నుంచి పర్యావరణవేత్త అవతారం ఎత్తేశారు అని కూడా అంటోంది. దాంతో ఆయన మానాన ఆయనను తిరగనీయండి అన్నట్లుగా చిన్నపాటి విమర్శలతో వదిలేస్తోంది. మొదట్లో గుడివాడ అమరనాధ్ గట్టిగానే మీడియా మీటింగ్ పెట్టి పాయింట్ టూ పాయింట్ ఆన్సర్ చేసేవారు. ఇపుడు మాత్రం ఆయన ఒకటి రెండు విమర్శలతో సరిపెట్టేస్తున్నారు.

దీనికి కారణం ఏమై ఉంటుంది అన్నది చర్చకు వస్తోంది. పవన్ ని వైసీపీ లైట్ గా తీసుకుంటోందా లేక ఆయన పర్యటనలకు జనాల నుంచి వస్తున్న రియాక్షన్ వైసీపీకి పెద్దగా ఇబ్బంది లేదని భావిస్తోందా అన్నది తెలియడంలేదు. చంద్రబాబు విషయంలోనూ ఇంతే జరిగింది.

ఆయన విజన్ 2047 డాక్యుమెంట్ అని విశాఖలో కొంత సందడి చేస్తే మాజీ మంత్రి పేర్ని నాని వంటి వారు సెటైరికల్ గా కామెంట్స్ చేశారు. విశాఖ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఈవెనింగ్ వాక్ అంటూ కౌంటరేశారు దీన్ని బట్టి చూస్తూంటే విపక్షాలు ఎక్కువగా జనాల్లో తిరిగేసి సీరియస్ నెస్ ని తగ్గించేసుకుంటున్నాయా లేక వారు చేసే ఆరోపణలలో పస లేదని వైసీపీ భావిస్తోందా అన్నదే తెలియడంలేదుట.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు