త్వ‌ర‌లో 'జ‌న్మ‌భూమి-2': చంద్ర‌బాబు నిర్ణ‌యం

తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వ‌హించారు. దీనికి సీఎం చంద్ర‌బాబు, పార్టీ ముఖ్య నాయ‌కులు, అదేవిధంగా పొలిట్ బ్యూరో స‌భ్యులు హాజ‌ర‌య్యారు.

Update: 2024-08-08 16:41 GMT

ఏపీలో త్వ‌ర‌లోనే జ‌న్మ‌భూమి-2 ప్రారంభించాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. అంతేకాదు.. జ‌న్మ‌భూ మి-2 ద్వారా క‌మిటీల‌ను ఏర్పాటు చేసేందుకు కూడా ప‌చ్చ‌జెండా ఊపారు. పార్టీని, ప్రభుత్వాన్ని అనుసం ధానించేలా ప్రణాళికలు రూపొందించ‌నున్నారు. పార్టీ ప్రతినిధులు ప్రభుత్వంలో భాగస్వాములు కావాల ని నిర్ణయించారు. 2014-19 మ‌ధ్య ఉన్న జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను ర‌ద్దు చేసి.. వాటి స్థానంలో కొత్త‌గా తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వ‌హించారు. దీనికి సీఎం చంద్ర‌బాబు, పార్టీ ముఖ్య నాయ‌కులు, అదేవిధంగా పొలిట్ బ్యూరో స‌భ్యులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. పార్టీ కోసం కష్టబడిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వ కుండా చూసేందుకు జ‌న్మ‌భూమి-2ను తిరిగి తీసుకురావాల‌ని నిర్ణ‌యించారు. అదేవిధంగా నామినేటెడ్ పదవుల విషయంలో ప్రత్యేక దృష్టిసారించి.. పార్టీ త‌ర‌ఫున ఇప్ప‌టికే అందిన జాబితా ప్ర‌కారం నిర్ణ‌యం తీసుకోనున్నారు.

ఎన్నికల ప్ర‌చారంలో ఇచ్చిన‌ హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని రూ.4000కు పెంచి ఇప్ప‌టికేమేలు చేశామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. అదేవిధంగా మెగా డీఎస్సీ, స్కిల్ సెన్సస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నక్యాంటీన్ల పునరుద్దరణపై సంతకాలు పెట్టామ‌న్నారు. ముఖ్యంగా ప్రాణాలకు తెగించి కష్టబడిన కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామ‌న్నారు. పార్టీ కార్యకర్తలపై వైసీపీ హ‌యాంలో పెట్టిన‌ అక్రమ కేసులపై ప్రత్యేకంగా పరిగణించి వాటిని ర‌ద్దు చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు.

పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన గ్రామస్థాయి కార్యకర్తకు కూడా న్యాయం జరిగేలా పదవులిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. త్వ‌రలోనే టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తామ‌న్నారు. అయితే.. పార్టీని మ‌రింత విస్త‌రించాల్సి ఉంద‌ని.. ప్ర‌త్య‌ర్థుల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా పార్టీని బ‌లోపేతం చేయాల‌ని ఆయ‌న సూచించ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News