దుమ్ములేపుతున్న పవన్ పొలిటికల్ యాడ్... వీడియో వైరల్!

అవును... ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జనసేన ఒక ప్రచార వీడియోను విడుదల చేసింది.

Update: 2024-03-15 11:24 GMT

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రజల మనసుల్లో తమ పార్టీ, తమ ఎన్నికల గుర్తు బలంగా నాటుకునేలా.. పోలింగ్ బూత్ లో వెంటనే గుర్తుకు వచ్చేలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు రాజకీయ నాయకులు. ఈ క్రమంలో "నా కల" అంటూ వైఎస్ జగన్ సరికొత్త క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా పవన్ కల్యాణ్ కూడా సినిమాటిక్ గా ఒక ప్రకటన వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

అవును... ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జనసేన ఒక ప్రచార వీడియోను విడుదల చేసింది. "ఫ్యాను గాలికి కొట్టుకుపోతున్న రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను చేపట్టిన గాజు గ్లాసు" అని ఆన్ లైన్ వేదికగా రాసిన జనసేన.. ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో అత్యంత ఆసక్తిగా ఉందని, సామాన్యులకు సైతం ఇట్టే అర్ధమయ్యేలా ఉందని, పవన్ చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పారని ఒకరంటుంటే... ప్రకటనల్లో అయినా పవన్ కుర్చీలో కూర్చోలేదని మరొకరు అంటున్నారు.

ఇక అత్యంత ఆసక్తిగా మారిన ఈ వీడియో ప్రకటనలో... ఫ్యాన్ స్విచ్ బాటన్ నొక్కగానే.. ఆ గాలికి టేబుల్ పై ఉన్న కాగితాలపై రాసి ఉన్న రాష్ట్ర అభివృద్ధి, పోలవరం, వ్యవసాయం, ఉద్యోగ అవకాశాలు, మౌలిక వసతులు, పరిశ్రమలు మొదలైనవి చెల్లాచెదురుగా పడిపోయినట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చి చెల్లాచెదురుగా పడిఉన్న ఆ కాగితాలను ఏరి తిరిగి టెబుల్ పై పెడతారు.

అవి మరోసారి ఎగిరిపోకుండా దానిపై గ్లాసును పెడతారు. ఆ పక్కనే కమలం గుర్తు, సైకిల్ గుర్తు కనిపిస్తుంటుంది. అనంతరం ఆ పేపర్లు ఏరి టెబుల్ పై పెట్టిన వ్యక్తి కుర్చీపై చెయ్యి వేసి పక్కన నిలబడతారు! అయితే.. ఆ వీడియోలు కనిపిస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని తెలుస్తున్నా... ఆ వీడియోలు ఆయన ముఖం మాత్రం కనిపించకుండా ఉంటుంది.

ఏది ఏమైనా... ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట దుమ్ము రేపుతుంది. "పొత్తు గెలవాలి.. ప్రభుత్వం రావాలి" అనే పేరుతో చేసిన ఈ వీడియోకు "ఫ్యాను" గాలికి కొట్టుకుపోతున్న రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను చేపట్టిన "గాజు గ్లాసు" అంటూ ఎక్స్ వేదికగా జనసేన ఒక పోస్టు పెట్టింది. ఇక ఈ వీడియో కింద కామెంట్లలో ఆన్ లైన్ వేదికగా రసవత్తర చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News