జేసీ సోదరులకు రాజకీయం అర్థమైందా... మెట్టు దిగారే...!
35 ఏళ్లపాటు అప్రతిహతంగా తాడిపత్రిని ఏలిన జేసీ బ్రదర్స్ ప్రభాకర్‌రెడ్డి, దివాకర్‌రెడ్డిలు ఇప్పుడు.. తమ పరిస్థితి ఏంటనే పరిస్థితికి వచ్చారు.
మిన్ను విరిగి మీదపడ్డా తమకేం కాదని చెప్పుకొనే జేసీ బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. 35 ఏళ్లపాటు అప్రతిహతంగా తాడిపత్రిని ఏలిన జేసీ బ్రదర్స్ ప్రభాకర్‌రెడ్డి, దివాకర్‌రెడ్డిలు ఇప్పుడు.. తమ పరిస్థితి ఏంటనే పరిస్థితికి వచ్చారు.
ఇది నిజం. జేసీ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన చేస్తున్న పనులు కూడా ఇప్పుడు చర్చకుదారితీస్తున్నాయి. ఒకప్పుడు జేసీలంటే.. వ్యక్తిగత ఇమేజ్ తో ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు.
ఈ పరిస్థితితోనే వారు పార్టీలకు, నాయకులకు కూడా కొరకరాని కొయ్యలుగా మారిపోయారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్నా.. తర్వాత.. టీడీపీలోకి వచ్చినా..వ్యక్తిగత ఇమేజ్‌తోనే వారు దూసుకు పోయారని చెప్పుకొనే వారు. అయితే.. ఒకే ఒక్క ఓటమి.. ఇప్పుడు జేసీలను ఇరకాటంలోకి నెట్టేసిందని అంటున్నారు పరిశీలకు లు. గత ఎన్నికల్లో బ్రదర్స్ ఇద్దరూ పోటీ నుంచి తప్పుకొని.. తమ వారసులను రంగంలోకి దింపారు. అయి తే.. వైసీపీ దూకుడుతో వారు.. ఓడిపోయారు.
అయినప్పటికీ.. దూకుడు తగ్గలేదని, వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని చెబుతు వచ్చారు. అయితే.. రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు కదా! ఇదే ఇప్పుడు జేసీలకు ఇబ్బందిగా మారింది.
కేడర్‌లో విభజన జరిగి.. వైసీపీ వైపు మద్దతు పలుకున్నవారు పెరుగుతున్నారు. పైగా టీడీపీ కేడర్ కూడా.. వారికి చేరువ కాలేక పోయింది. ఈ పరిణామాలతో ఇప్పుడు జేసీలకు.. నాలుగేళ్లు తిరిగే సరికి.. సొంత బలం చాలదు.. పార్టీ బలం కావాలని పోరు పెడుతున్నారు.
ఈ క్రమంలోనే ఇటు టీడీపీ కేడర్‌ను చేరువ చేసుకునేందుకు .. అదేసమయంలో టీడీపీ అధినేత చంద్ర బాబును మచ్చిక చేసుకునేందుకు కూడా జేసీ బ్రదర్స్ ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీనే తమను గెలిపించాలని.. కేడరే తమను గెలిపించాలని.. ఇటీవల జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. మొత్తానికి నాలుగేళ్లలో ఎంత మార్పు? అని జేసీల గురించి తెలిసిన వారు చర్చించుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.