ప్రపంచ కురువృద్ధుడు కన్నుమూత... 12 మంది మునిమునిమనవలు!

అవును... ప్రపంచంలోనే "పెద్ద మనిషి"గా పేరున్న జువాన్ విసెంటె పెరెజ్ మోరా కన్నుమూశారు.

Update: 2024-04-04 06:51 GMT

2022లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా సర్టిఫికెట్ పొందిన జువాన్ విసెంటె పెరెజ్ మోరా తన 114వ ఏట మంగళవారం నాడు కన్నుమూశారు! ఈ మేరకు ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులతో పాటు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా... "జువాన్ విసెంట్ పెరెజ్ మోరా.. 114 ఏళ్ల వయసులో శాశ్వతత్వంలోకి ప్రవేశించారు" అని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఎక్స్ వేదికగా తెలిపారు.

అవును... ప్రపంచంలోనే "పెద్ద మనిషి"గా పేరున్న జువాన్ విసెంటె పెరెజ్ మోరా కన్నుమూశారు. గిన్నీస్ బుక్ లెక్కల ప్రకారం... ఫిబ్రవరి 4 - 2022 నాటికి ఆయన వయసు 112 సంవత్సరాల 253 రోజులని నిర్ధారించబదింది. దీంతో... ప్రపంచంలో ఎక్కువకాలం జీవించి ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డ్స్ లోకి ఎక్కారు. ఈ క్రమంలో తన 114వ ఏట ఆయన మృతి చెందారు.

టియో విసెంట్ అనే రైతుకు 1909 మే 27న ఆండియన్ రాష్ట్రంలోని టాచిరాలోని ఎల్ కోబ్రే పట్టణంలో మోరా జన్మించారు. ఆయన తండ్రికి ఉన్న 10 మంది పిల్లల్లో మోరా తొమ్మిదో సంతానం. ఈ క్రమంలో మోరా తన ఐదేళ్ల వయసులోనే తన తండ్రి, సొదరులతో కలిసి వ్యవసాయంలో పనిచేయడం ప్రారంభించాడని.. చెరకు, కాఫీ హార్వెస్టింగ్ లో సహాయం చేసేవాడని 2022లో గిన్నిస్ బుక్ తన ప్రకటనలో పేర్కొంది!

ఇక మోరాకు 11 మంది సంతానం కాగా... 2022 నాటికి అతనికి 41 మంది మనుమలు, 18 మంది ముని మనుమలు, 12 మంది మునిముని మనవలు ఉన్నారు! ఇక, 1909లో జన్మించిన మోరా... మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, స్పానిష్ ఫ్లూ మహమ్మారి, కోవిడ్ 19 మహమ్మారిలను చూశాడు! ఈ క్రమంలోనే తన 114వ ఏట మృతిచెందారు!

Tags:    

Similar News