6జీ అభివృద్ధిలో భారత్ పాత్రపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

6జీ టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ ముందుంటుందని.. ప్రపంచ వ్యాప్తంగా పేటెంట్లకు 10శాతం తోడ్పడాలనే లక్ష్యంతో ఉందని సింధియా తెలిపారు.

Update: 2025-02-16 14:44 GMT

భారతదేశం ఆర్థిక వృద్ధికి కేంద్రంగానే కాకుండా.. ఆవిష్కరణల కేంద్రంగా కూడా మారుతుందని.. ఈ సమయంలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ టెలిఫోనీని ప్రవేశపెట్టామని.. ఈ నేపథ్యంలో తదుపరి తరం 6జీ టెక్నాలజీ అభివృద్ధిలో ముందుంటుందని కమ్యునికేషన్స్ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు.

అవును... 6జీ టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ ముందుంటుందని.. ప్రపంచ వ్యాప్తంగా పేటెంట్లకు 10శాతం తోడ్పడాలనే లక్ష్యంతో ఉందని సింధియా తెలిపారు. తాజాగా జరిగిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో మాట్లాడిన ఆయన.. ప్రైవేటు రంగానికి చెందిన నిపుణులు, పరిశోధకులు, ఐఐటీ లతో ఒక పత్రాన్ని తయారు చేసిందని అన్నారు.

ఇదే సమయంలో... గత దశాబ్ధంలో భారతదేశంలో నిర్మించబడిన డిజిటల్ హైవే ఆర్థిక వృద్ధికి అపారంగా దోహదపడిందని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే.. భారతదేశం ఆర్థిక వృద్ధికి కేంద్రగానే కాకుండా.. ఆవిష్కరణల కేంద్రంగా కూడా మారుతుందని.. వృద్ధికి శక్తినిచ్చేది ఆవిష్కరణే అని వెల్లడించారు.

ఈ నేపథ్యలోనే తాము భారతదేశంలో మల్టిపుల్ ఫ్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన మంత్రి.. ప్రపంచంలో కొత్త రకమైన నమూనా ఆవిష్కరణల పెరుగుదలలో ఫ్యాబ్ లు ఒక ముఖ్యమైన భాగమని అన్నారు. గత 10 ఏళ్లలో మనం 7 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) వద్ద అభివృద్ధి చెందామని తెలిపారు.

అందువల్లనే మన 25 కోట్ల మందిని దారిద్ర్యరేఖకు ఎగువకు ఎత్తగలిగామని అన్నారు. ఈ విధంగా ముందుకెళ్లడం వల్ల 2027 నాటికి భారతదేశం జర్మనీ, జపాన్ లను అధిగమించి మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని మంత్రి అన్నారు.

Tags:    

Similar News