ఎవ్వరూ ఊహించని వ్యక్తిని ఢిల్లీ సీఎం చేసిన బీజేపీ
కానీ ఆ యోగీ ఆదిత్యనాథ్ ఇప్పుడు మోడీ లాంటి ఇమేజ్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు.
బీజేపీ అంటేనే అనూహ్యం.. యూపీలో అసలు పెళ్లాం పిల్లలు లేని ఒక సన్యాసిని సీఎం చేసి ప్రజల కోసం పనిచేయాలని చెప్పినప్పుడు అంతా ముక్కున వేలేసుకున్నారు. కానీ ఆ యోగీ ఆదిత్యనాథ్ ఇప్పుడు మోడీ లాంటి ఇమేజ్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. బీజేపీ ఎంపిక చేసే సీఎంలు ఎక్కడైనా ఎవ్వరి ఊహాలకు అందరూ.. సర్ ప్రైజ్ గా ఉంటుంది. ఇప్పుడు నేషనల్ మీడియా , విశ్లేషకులు ఎవ్వరూ ఊహించని వ్యక్తిని ఢిల్లీ సీఎంను చేసి ఆశ్చర్యపరిచింది బీజేపీ.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఘన విజయం సాధించి, సుమారు మూడు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో అధికారం సంపాదించింది. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఎన్నికల ప్రచారం అద్భుతమైనదిగా నిలిచింది.
ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తయి, కొత్త ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాజా జాతీయ మీడియా నివేదికల ప్రకారం, బీజేపీ రేఖా గుప్తాను ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అనధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉంది. బీజేపీకి గత కొన్నేళ్లుగా ఆమె నమ్మకస్తురాలిగా ఉండటమే కాక, పార్టీ నాయకత్వం ఆమెపై పూర్తి విశ్వాసం ఉంచినట్లు తెలుస్తోంది.
రేఖా గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం విశేషం.. ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి కుమార్తె అయిన ఆమె, రాజకీయంగా ఎదిగి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని అందుకోబోతున్నట్టు సమాచారం.
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మను బీజేపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించింది. కేజ్రివాల్‌పై విజయం సాధించిన పర్వేష్ వర్మనే సీఎం అవుతారని అందరూ భావించారు. అయితే, బీజేపీ అంచనాలను తారుమారు చేస్తూ రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ప్రకటించింది.