రూ.80 వేల కోట్లతోనే కాళేశ్వరం కట్టారా?
కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని అప్పులు తెచ్చారు. మిషన్ భగీరథతో రూ.5700 కోట్లు సంపాదిస్తామని అన్నారు
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక పరిస్థితిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాగునీటి రంగానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.80 వేల కోట్లు మాత్రమే వెచ్చించినట్లు చెబుతోంది. ఇదంతా అబద్ధమని ప్రభుత్వం వాదిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతూ తప్పించుకోవాలని చూస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది.
కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని అప్పులు తెచ్చారు. మిషన్ భగీరథతో రూ.5700 కోట్లు సంపాదిస్తామని అన్నారు. ప్రజలకు ఎలాంటి లాభాలు లేకపోయినా ఈ ప్రాజెక్టుల పేరుతో రూ. లక్షల కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టారని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. సభా వేదికగా బీఆర్ఎస్ చేసిన అప్పులు ఏకరువు పెట్టారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజలకు ఎలాంటి లాభాలు కలగలేదు. కానీ దాని అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.97 వేల కోట్లు రుణంగా తీసుకున్నారని చెబుతున్నారు. ఇంత భారీ రుణం తీసుకుని ప్రాజెక్టును పూర్తి చేసినా దాని మనుగడ ప్రశ్నార్థకంలో పడటంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
శాసనసభలో రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. వాస్తవ పరిస్థితుల ఆధారంగా గత ప్రభుత్వం ఖర్చు చేసిన బడ్జెట్ గురించి పలువురు సభ్యులు మాట్లాడారు. ఆర్బీఐ, కాగ్ నుంచి తమకు కావాల్సిన సమాచారం తీసుకున్నారు. గత ప్రభుత్వం దగ్గర ఏ రోజు కూడా మిగులు బడ్జెట్ లేదు. రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పుడు తీసుకొచ్చే అవసరాలు తీర్చుకున్నట్లు తెలుస్తోందని కాంగ్రెస్ తెలియజేసింది.
గత ప్రభుత్వం చేసిన అప్పుల విషయం మీదే ప్రధానంగా చర్చ జరిగింది. సాగునీటి కోసమే ప్రధానంగా ఖర్చు చేసినా దాని ఫలాలు మాత్రం ఆశించిన స్థాయిలో అందలేదు. దీంతోనే మన ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఏ ప్రభుత్వమైనా అప్పులు తెస్తూ పాలన సాగిస్తోంది. ఈ క్రమంలో మన బతుకులు మారాలంటే మన జీవన ప్రమాణ స్థాయిని పెంచే చర్యలు మాత్రం కనిపించడం లేదని పలువురు విస్మయం వ్యక్తం చేయం గమనార్హం.