కాళేశ్వరం ప్రాజెక్ట్... కేసీఆర్, హరీష్ లకు కమిషన్ బిగ్ షాక్?
అవును... సుమారు 10ఏళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆరెస్స్ కు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వరుస కష్టాలు పలకరిస్తున్నయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో బీఆరెస్స్ పెద్దలకు ఫుల్ బ్యాడ్ టైం నడుస్తున్నట్లుందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అనంతరం లోక్ సభ ఎన్నికలో ఘోర ఫలితాలు, మరోపక్క పలువురు బీఆరెస్స్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారనే కథనాలు, ఇంకోపక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం, ఈడీ చేతికి గొర్రెల పంపిణీ పథకం... ఇవి చాలవన్నట్లు తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు కమిషన్ సిద్ధమవుతుండటం!
అవును... సుమారు 10ఏళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆరెస్స్ కు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వరుస కష్టాలు పలకరిస్తున్నయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గొర్రెల పంపిణీ పథకంలో సుమారు రూ.700 కోట్ల మేర అవినీతి జరిగిందని.. ఈ విషయంపై కేసీఆర్ కు ఈడీ నోటీసులు సిద్ధం చేసిందని కథనాలొస్తున్న వేళ.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారం తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా... కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ సిద్ధమవుతోందని.. ఈ క్రమంలో త్వరలో మరోసారి ఆకస్మిక పర్యటనలు ఉండోచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లకు నోటీసులు ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే గుసగుసలు తెలంగాణ రాజకీయాల్లో మొదలయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతంగా కొనసాగుతుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా గురువారం నాడు హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజినీర్లను విచారించిన కమిషన్... నేడు మరికొందరిని పిలిచి విచారిస్తుందని తెలుస్తుంది. ఈ క్రమంలో హైడ్రాలజీ నిపుణుల కమిటీ, ఇంజినీరింగ్ కమిటీలను... రెండు వారాల్లో మధ్యంతర నివేదిక, వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను అందించాలని కోరినట్లు తెలుస్తుంది!
ఈ క్రమంలో ముందుగా టెక్నికల్ అంశాలు, అనంతరం ఆర్థిక అంశాలపై కమిషన్ దృష్టి సారించనుందని తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆనకట్ట నిర్మాణ అంచనాలు, అప్పులు, వడ్డీ రేట్లు మొదలైన అంశాలపై విచారన చేయనుందని అంటున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే ఎల్ & టీ, నవయుగ, ఆఫ్క్రాన్ కనస్ట్రక్షన్స్ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు.
అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక ఇచ్చేందుకు జూన్ 30 డెడ్ లైన్ కావడంతో నిర్మాణ కంపెనీలు, అధికారుల నుంచి అన్ని వివరాలను సేకరిస్తోందంట కమిషన్. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ లకు నోటీసులు ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది!!