తమిళనాట హాట్ టాపిక్... కమల్ హాసన్ సంచలన నిర్ణయం!
తమిళనాట రాజకీయాలు రోజు రోజుకీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
తమిళనాట రాజకీయాలు రోజు రోజుకీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దక్షిణాదిలో కమలానికి దారులు మూసేయాలని బలంగా నిర్ణయించుకున్న తమిళనాట కీలక పార్టీలు ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా "మక్కల్ నీది మయ్యం" (ఎం.ఎన్.ఎం) అధినేత కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది!
అవును... ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా కీలకంగా వ్యవహరించాలని బలంగా ఫిక్సయిన కమల్ హాసన్... ఇప్పటికే ఆ దిశగా పలు అడుగులు వేశారు. ఇందులో భాగంగా... డీఎంకే కూటమిలో చేరేందుకు కమల్ సిద్ధమైనట్లు తెలిసింది. మతవాద సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించే కమల్... ఎం.ఎన్.ఎం స్థాపించిన తర్వాత బీజేపీని, దాని మిత్రపక్షాలను తీవ్రస్థాయిలో దుబ్బయడుతున్న సంగతి తెలిసిందే.
ఈ సమయంలో ఒంటరిగా పోటీచేసి ఇబ్బందులు కొనితెచ్చుకునేకంటే... భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి సాగాలని కమల్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... డీఎంకే నేతృత్వంలోని "ఇండియా" కూటమితో జత కట్టేందుకు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన కమల్... అనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ నేతలతో మరింతగా చేతులు కలిపారు. దీంతో త్వరలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టబోతున్నారని కథనాలొచ్చాయి. ఈ సమయంలో అవి కార్యరూపం దాల్చబోతున్నాయి!
ఈ నేపథ్యంలో కూటమి నేతలు సీట్ల సర్దుబాటు దిశగా సన్నాహాలు మొదలుపెట్టారని సమాచారం. ఈ నెలాఖరుకే సీట్ల సర్దుబాటుపై అవగాహన వస్తుందని తెలుస్తోంది. కాంగ్రెస్ తమిళనాట అత్యంత విశ్వాసమిత్రుడైన డీఎంకే... రాష్ట్రంలో ఇండియా కూటమికి నేతృత్వం వహించనుంది.
అయితే గత లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో వున్న 39 స్థానాలకు గానూ 38 స్థానాలను డీఎంకే కూటమి గెలుచుకుంది. ఇందులో భాగంగా... డీఎంకే 20, కాంగ్రెస్ 9, సీపీఐ 2, సీపీఎం 2, డీపీఐ 1, మిత్రపక్షాలు 4 స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయితే ఎం.ఎన్.ఎం డీఎంకే కూటమిలో చేరితే ఆ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ చిహ్నంపై పోటీ చేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది.
తద్వారా కాంగ్రెస్కు 10 స్థానాలు రావడంతో పాటు ఎం.ఎన్.ఎం కు ఒక ఎంపీ సీటు ఇచ్చినట్లవుతుందని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కారణం... గతేన్నికల్లో తేని నియోజకవర్గం కాంగ్రెస్ కు కేటాయించగా.. అక్కడ అన్నాడీఎంకే అభ్యర్థి రవీంద్రనాథ్ విజయం సాధించారు.
ఏది ఏమైనా తాజాగా కమల్ హాసన్ కూడా ఇండియా కూటమిలో చేరడంతో... తమిళనాట డీఎంకే రాజకీయానికి ఇక ఎదురులేకుండాపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!