నీ సింబల్ కంటే నీ ఫోటో బాగుంది... మహిళా అభ్యర్థిపై ఆర్వో కామెంట్?

ఎన్నికల గుర్తు బొమ్మ పక్కన ఉన్న నీ బొమ్మ చూసైనా ఓటు వేస్తారులే అని అంటూ మరికొన్ని వ్యాఖ్యలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ఆమె స్వయంగా పంచుకున్నారు.

Update: 2023-11-24 15:28 GMT

రిటర్నింగ్ అధికారి తనతో అసభ్యంగా మాట్లాడారని కామారెడ్డి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి భార్గవి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కేటాయించిన ఎన్నికల గుర్తు స్పష్టంగా కనిపించడం లేదని రిటర్నింగ్ అధికారిని అడిగితే... ఎన్నికల గుర్తు బొమ్మ పక్కన ఉన్న నీ బొమ్మ చూసైనా ఓటు వేస్తారులే అని అంటూ మరికొన్ని వ్యాఖ్యలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ఆమె స్వయంగా పంచుకున్నారు.

అవును... బేలెట్ పేపర్ లో బీఆరెస్స్, బీజేపీ, కాంగెస్, బీఎస్పీ... ఈ నాలుగు పార్టీల ఎన్నికల గుర్తులే స్పష్టంగా కనిపిస్తున్నాయని, మిగిలిన వారిలో ఇండిపెండెంట్ పార్టీల గుర్తులు చాలా లైట్ గా కనిపిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా తనకు బేబీ వాకర్ గుర్తు కేటాయించారని చెప్పిన ఆమె... అది స్పష్టంగా లేదని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆఫీసుకెళ్లి అడిగితే... ఈ విషయంపై ఆర్వోని అడగమని చెప్పినట్లుగా ఆమె తెలిపారు.

దీంతో తనకు కేటాయించిన బేబీ వాకర్ గుర్తు ఈవీఎం లో సరిగా కనిపించడంలేదని రిటర్నింగ్ అధికారిని అడిగినప్పుడు.. "బాగానే కనిపిస్తుందని.. ఆ సింబల్ కంటే మీ ఫోటో బాగుంది, మిమ్మల్ని చూసి వేస్తారు" అని అన్నారని ఆమె తెలిపారు. దీంతో ఎక్కువగా మాట్లాడుతున్నారు.. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండి, ఎలక్షన్ డ్యూటీలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పినట్లు ఆమె తెలిపారు.

ఇదే సమయంలో తనతో పాటు తన తండ్రి, అక్కడున్న పలువురు నిలదీసే సరికి చప్పుడు చేయకుండా వెళ్లిపోయాడని ఆమె చెబుతున్నారు. దీంతో... ఈ ఇష్యూ సీరియస్ అయ్యి బ్యాలెట్ పత్రాలు మార్చే వరకూ వస్తుందా.. లేక, ఈమె ఒక్కరి ఆవేదనగానే మిగిలిపోతుందా.. ఈ ఘటనపై విచారణ ఉంటుందా.. ఉండదా అనే చర్చ కామారెడ్డిలో మొదలైంది!

Tags:    

Similar News