కాళేశ్వరం ఆటలో అరటిపండు కేఏ పాల్
తాజాగా కేఏ పాల్ మాట్లాడుతూ "ఇండియాలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని.. ఇందులో 50 వేల కోట్ల అవినీతి జరిగిందని
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని విపక్షాలు తరచూ ఆరోపణలు చేయడం సహజంగా చూస్తున్నాం. అసలు ఆ ప్రాజెక్టుకు అయిన ఖర్చు వాస్తవంగా రూ.88 వేల కోట్లు మాత్రమే. తాజాగా ఈ ఆరోపణల పరిధిలోకి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా చేరాడు.
తాజాగా కేఏ పాల్ మాట్లాడుతూ "ఇండియాలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని.. ఇందులో 50 వేల కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని హైదరాబాద్ కోఠీలోని సీబీఐ కార్యాలయంలో " కేఏ పాల్ ఫిర్యాదు చేశారు.
ఎన్నికల సమయంలో కాళేశ్వంలో జరిగిన అవినీతి గురించి ప్రశ్నించిన సీఎం రేవంత్... ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని... ఈ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రేవంత్ లేఖ రాయాలని .. ఈ ప్రాజెక్టులో అవినీతి బయటకు వచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉప ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేఏ పాల్ మీడియా సంచలనాలకు తప్ప మరేవిధంగా ప్రభావం చూపడం లేదు. మీడియా కూడా రేటింగ్ కోసం తప్ప కేఏ పాల్ ను మరోవిధంగా భావించక పోవడం ఆశ్చర్యకరం.