ప్రస్తుతానికి నోటాను దాటేసిన కెఎ పాల్ !

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పార్టీ పెట్టినప్పటి నుండి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సందడి చేస్తూనే ఉన్నాడు.

Update: 2024-06-04 06:42 GMT

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పార్టీ పెట్టినప్పటి నుండి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సందడి చేస్తూనే ఉన్నాడు. టీవీ ఛానళ్లు తమ రేటింగ్ కోసం కెఎ పాల్ ను వాడుకుంటుండడం కూడా వాస్తవం. అయితే తెలంగాణలో మునుగోడులో జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కెఎ పాల్ నానాహంగామా చేశాడు. ఆ ఎన్నికల్లో కేవలం 805 ఓట్లకు పరిమితం అయ్యాడు.

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కెఎ పాల్ విశాఖపట్నం నుండి ప్రజాశాంతి పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలంటే తనను ఎంపీగా ఎన్నుకోవాలని పాల్ ప్రచారంలో పేర్కొన్నాడు. మీడియా తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని దుమ్మెత్తి కూడా పోశాడు.

అయితే ప్రస్తుతం బహిర్గతమవుతున్న ఓటింగ్ సరళిని పరిశీలిస్తే విశాఖలో కెఎ పాల్ ఓట్లలో నోటాతో పోటీ పడుతున్నాడు. ఇక్కడ ఇప్పటి వరకు నోటాకు 1037 ఓట్లు రాగా, కెఎ పాల్ కు 1663 ఓట్లు పోలయ్యాయి. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ 1,73,528 ఓట్లు సాధించి 93,128 ఓట్ల ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతుండగా వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ 80,400 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది.

Tags:    

Similar News