కేసీఆర్ పై పోటీకి సిద్ధం... తొలి జాబితా విడుదల చేసిన కేఏ పాల్!
తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార పక్షం, విపక్షాలు అభ్యర్థులను ప్రకటించేసి ఫుల్ జోష్ లో ప్రచార కార్యక్రమాలకు తెరలేపాయి
తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార పక్షం, విపక్షాలు అభ్యర్థులను ప్రకటించేసి ఫుల్ జోష్ లో ప్రచార కార్యక్రమాలకు తెరలేపాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీఆరెస్స్, కాంగ్రెస్, బీజేపీ ల మధ్యే పోటీ అని అనుకుంటున్నప్పటికీ మిగిలిన పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటిస్తూ వేడి పెంచేస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీల అనంతరం బీఎస్పీ కూడా ఆసక్తికరమైన మేనిఫెస్టో విడుదల చేసి, అభ్యర్థులను ప్రకటించేసింది. ఈ సమయలో కేఏ పాల్ రంగంలోకి దిగారు.
అవును... తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ, వైఎస్సార్టీపీ తమ నిర్ణయాన్ని ప్రకటించగా.. జనసేన పర్టీ, బీజేపీతో పొత్తులో ఎన్నికలకు వెళ్తుంది. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు కూడా ఒక కొలిక్కి వచ్చిందని ఇరు పార్టీల నేతలూ చెప్పారు. ఈ నేపథ్యంలో తాను మాత్రం ఒంటరిగా పోటీ చేస్తాను అంటూ కేఏ పాల్ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా తాజాగా ఆ పార్టీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేశారు. పోటీకి సై సై అంటున్నారు.
కేఏ పాల్ తాజాగా 12 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే.. 344 మంది టికెట్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారని తెలిపిన ఆయన... తమ ప్రజాశాంతి పార్టీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో... సోమవారం 12 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన ఆయన... మంగళవారం మలి విడత జాబితా కూడా విడుదల చేస్తామని తెలిపారు.
ఈ సమయంలో ఈసారి రెండు చోట్లా పోటీ చేస్తున్న కేసీఆర్ పై గజ్వేల్ లో కేండిడేట్ ను రంగంలోకి దింపారు కేఏ పాల్. ఇప్పటికే కేసీఆర్ ని గజ్వేల్ లో ఓడించాలని ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి తన వంతు ప్రయ్త్నం తాను చేస్తుండగా... కామారెడ్డిలో రేవంత్ సై అంటున్నారు. సరికొత్త వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో... పాండు అనే అభ్యర్థిని గజ్వేల్ లో పోటీకి నిలబెడుతున్నారు కేఏ పాల్. మరి తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ఏమేరకు ప్రభావం చూపిస్తుందనేది వేచి చూడాలి.
ఇందులో భాగంగా... "అధికార దాహంతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. నేను అందరికి సమాదానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది" అని మొదలుపెట్టిన ఆయన... "తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో మేము పోటీలో ఉన్నాము.. బరిలో నిలుస్తాం, గెలుస్తాం. కేసీఆర్, కేటీఆర్ నా మీద దాడులు చేయించి నన్ను ఇబ్బంది పెట్టారు. కేసులు పెట్టి, పోలీస్ లను పంపిన నన్ను, నా కార్యకర్తలు ను ఇబ్బంది పెట్టారు. శ్రీకాంతాచారి వాల్ల నాన్నను ఇబ్బంది పెట్టారు" అని అన్నారు.
అనంతరం... "గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరితే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. రేవంత్ రెడ్డి, గద్దర్ కు 150 కోట్లు ఇస్తామని బెదిరింపులు గురి చేశారు. కామారెడ్డిలో నేను పోటీ చేస్తా అనగానే రైతు కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. నేను రేవంత్ రెడ్డికి మద్దత్తు ఇవ్వాలని బండ్ల గణేష్ నాకు కాల్ చేశారు. నాకు బెదిరింపులు ఫోన్ లు వస్తున్నాయి. నన్ను బెదిరించి రాజకీయం చేయాలంటే ఎవరి తరం కాదు" అని ట్విట్టర్ లో తెలిపారు.
ప్రజాశాంతి పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న అభ్యర్థులు:
గజ్వేల్ - పాండు
చెన్నూరు - మొయ్య రాంబాబు
వేములవాడ- అజ్మీరా రమేష్ బాబు
జుక్కల్ (ఎస్సీ) - కర్రోల్ల మోహన్
జహీరాబాద్ - బేగరి దశరథ్
రామగుండం- బంగారు కనకరాజు
ఉప్పల్ - కందూరు అనిల్ కుమార్
మధిర - కొప్పుల శ్రీనివాస్ రావు
నర్సాపురం - సిరిపురం బాబు
కల్వకుర్తి - కట్టా జంగయ్య
యాకుత్పురా - సిల్లివేరు నరేష్
నకిరేకల్ - కదిర కిరణ్ కుమార్
ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు పాల్.