లారెన్స్ బిష్ణోయ్ ని చంపితే రూ.1,11,11,111... రివార్డ్ ప్రకటించిన సేన!

ఎన్సీపీ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-22 04:57 GMT

ఎన్సీపీ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ముంబై ఒక్కసారిగా ఉలిక్కిపడింది! ఈ సమయంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణొయ్ పేరు మరోసారి తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో అతడిని చంపితే భారీ రివార్డ్ అంటూ ఓ ప్రకటన ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.

అవును... ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను చంపితే వారికి భారీ రివార్డ్ అంటూ ప్రకటించింది క్షత్రియ కర్ణి సేన. ఇందులో భాగంగా... లారెన్స్ ను ఎవరైనా చంపితే వారికి రూ.1,11,11,111 బహుమతిగా ఇస్తామని.. జైల్లో అతడిని ఎన్ కౌంటర్ చేసిన అధికారికైనా ఇస్తామని క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ ప్రకటించారు.

ఇలా లారెన్స్ బిష్ణోయ్ ను ఎన్ కౌంటర్ చేసిన భద్రతా సిబ్బందికి అయినా ఈ మొత్తాన్ని అందజేస్తామంటూ రాజ్ షెకావత్ ప్రకటించడం వైరల్ గా మారింది. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ సరిహద్దు దాటి డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో గుజరాత్ లోని సబర్మతీ జైలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు!

కాగా.. 2023 డిసెంబర్ 5న జైపూర్ లో గుర్తుతెలియని దుండగులు క్షత్రియ కర్ణి సేన అధినేత సుఖ్ దేవ్ సింగ్ గోగమేడి ని కాల్చి చంపారు. అయితే... అతడి హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతని హత్యకు బాధ్యత వహించింది. ఈ నేపథయంలో రాజ్ షెకావత్ ఈ భారీ రివార్డ్ ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.

అదే ఏడాది సెప్టెంబర్ లో ఖలిస్తానీ సానుభూతిపరుడు సుఖా దునేకే హత్యకు కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఇక.. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనకూ బాధ్యత వహించిన లారెన్స్ ముఠా... బాబా సిద్ధిఖ్ హత్య కు బాధ్యత వహించింది. దావూద్ ఇబ్రహీంతో లింకులు, సల్మాన్ ఖాన్ తో సన్నిహిత సంబంధాల కారణంగా సిద్ధిఖ్ హత్య చేసినట్లు చెబుతున్నారు!

Tags:    

Similar News