కవితకు కోపమొచ్చింది

ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ ను మంత్రులు, ఎంఎల్ఏలు పట్టించుకోకపోవటమే కారణమని ఇంకొందరన్నారు.

Update: 2024-01-09 07:30 GMT

పార్లమెంటు ఎన్నికలపై బీఆర్ఎస్ లో వరుసగా సమీక్షలు జరుగుతున్నాయి. పార్టీ ఆపీసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమీక్షల్లో రాబోయే ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై చర్చలు జరుగుతున్నాయి. పనిలోపనిగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపైన కూడా పోస్టుమార్టమ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే పార్టీలోని గొడవలన్నీ బయటపడతున్నాయి. ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న మంత్రులు, ఎంఎల్ఏకే కేసీయార్ మళ్ళీ టికెట్లు ఇవ్వటమే ఓటమికి ప్రధాన కారణమని కొందరన్నారు.

ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ ను మంత్రులు, ఎంఎల్ఏలు పట్టించుకోకపోవటమే కారణమని ఇంకొందరన్నారు. నిజానికి పై రెండు కారణాలు కూడా వాస్తవమే. అయితే పై రెండు కారణాలకు భిన్నంగా కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు ఇపుడు వైరల్ గా మారాయి. నిజామాబాద్ పార్లమెంటు సీటు పరిధిలోని వ్యవహారాలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో కవిత మాట్లాడుతు ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏలపై ఫుల్లుగా ఫైర్ అయ్యారు. పార్టీ ఓటమికి ఎంఎల్ఏలు, మాజీలే కారణమని ధ్వజమెత్తారు.

ఎంఎల్సీగా ఉన్న తననే పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, క్యాడర్ ను కలవనీయకుండా ఎంఎల్ఏలు, మాజీలు అడ్డుకున్నారని ఆరోపించారు. నిజామాబాద్ నియోజకవర్గం పరిధిలో తాను పర్యటించాలని అనుకున్నపుడు ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ సహకారం అందకుండా కొందరు అడ్డుకున్నట్లు ఆమె చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అసలామె చెప్పింది నిజమే అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. కవితంటే మామూలు ఎంఎల్సీ కాదు. స్వయాన కేసీయార్ కూతురు. తండ్రిని చూసుకునే ఆమె విచ్చలవిడిగా అధికారాలను అనుభవించారనే ఆరోపణలకు కొదవలేదు.

పైగా ఆమెమీ మెతక కూడా కాదు. చాలా స్పీడుగా దూసుకుపోయే మనిషే. ఇలాంటి కవితను కలవనీయకుండా ద్వితీయశ్రేణ నేతలు, క్యాడర్ను ఎవరు అడ్డుకోగలరు ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎంఎల్ఏలు ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ను పట్టించుకోలేదని కవిత ఆరోపించారు. తననే కొందరు పార్టీలో ఇబ్బంది పెట్టినపుడు ఇక నేతలు, క్యాడర్ తో ఎలా వ్యవహరించుంటారో అర్ధంచేసుకోవచ్చన్నారు. కవిత ఇపుడు చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలే పార్టీలో హాట్ టాపిక్కుగా మారాయి.

Tags:    

Similar News