ఢిల్లీ చేరిన వరంగల్ రాజకీయం? కాంగ్రెస్ సీటు కావ్యకేనా?

ఈనేపథ్యంలో ఇక్కడ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన తాటికొండ రాజయ్యతో కడియంకు విభేదాలు ఉండేవి.

Update: 2024-03-29 10:38 GMT

వరంగల్ రాజకీయాలు ప్రస్తుతం ఢిల్లీ చుట్టు తిరుగుతున్నాయి. ఇన్నాళ్లు వరంగల్ టికెట్ పై పోటీ కి సై అన్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య ఇప్పుడు పోటీకి సిద్ధంగా లేనని ప్రకటించడంతో వివాదం మొదలైంది. కడియం తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీతో కొనసాగించారు. ఆ పార్టీ కనుమరుగు కావడంతో బీఆర్ఎస్ లో చేరారు.

ఈనేపథ్యంలో ఇక్కడ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన తాటికొండ రాజయ్యతో కడియంకు విభేదాలు ఉండేవి. పార్టీ టికెట్ కోసం ఇద్దరికి మధ్య పోటీ ఉండేది. ఆ సమయంలో కూడా కేసీఆర్ కడియం వెంటే నిలిచారు. తాటికొండను పక్కన పెట్టేశారు. అందుకే ప్రస్తుతం కావ్య వరంగల్ ఎంపీ సీటుపై కడియంకే మొగ్గు చూపి ఆయన కూతురుకే టికెట్ ఖరారు చేశారు.

బీఆర్ఎస్ మునిగిపోతున్న నావ అనే పరిస్థితుల్లో కడియం శ్రీహరి కాంగ్రెస్ ఇస్తున్న ఆఫర్ ను కాదనలేకపోతున్నారు. వరంగల్ ఎంపీ సీటు తమ పార్టీ నుంచి కూడా ఇస్తామని చెబుతుండటంతో బీఆర్ఎస్ కు దాదాపు రాంరాం చెప్పినట్లే. ఇక కడియం తన కూతురుతో ఢిల్లీలోనే మకాం వేసి కాంగ్రెస్ నేతలతో మంతనాలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోయారు.

ఇలా నమ్మిన బంట్లే మోసం చేస్తుంటే కేసీఆర్ తెగ బాధపడుతున్నారు. మరోవైపు వరంగల్ ఎంపీ సీటుపై తాను పోటీకి రెడీ అని తాటికొండ రాజయ్య ప్రకటించడంతో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజయ్యను కేసీఆర్ చేరదీస్తారా? ఆయన కోరికను మన్నిస్తారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. కేసీఆర్ నిర్ణయం ఏముంటుందో తెలియడం లేదు.

మరోవైపు ఇక్కడనుంచి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఇప్పుడు కడియం సైతం పార్టీని వదిలేందుకు సిద్ధంగా ఉండటంతో ఏం జరుగుతుందోననే వాదన అందరిలో వస్తోంది. వరంగల్ భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. వరంగల్ ఎంపీ సీటు ఎవరికి కేటాయిస్తారని చూస్తున్నారు.

Tags:    

Similar News