సోదరి పార్థివ దేహానికి కేసీఆర్ నివాళి!
సోదరి చీటి సకలమ్మ పార్థిమ దేహానికి మాజీ సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను, బంధువులను ఓదార్చారు.
మాజీముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోదరి సకలమ్మ (82) చనిపోయారు. కొంత కాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రిలో చేర్పించారు. కాగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె కనుమూశారు.
కొంతకాలంగా సకలమ్మ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. చికిత్స పొందుతున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా.. సోదరి మరణ వార్త విన్న మాజీ సీఎం కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. సకలమ్మ భర్త హన్మంతరావు కొన్నాళ్ల క్రితమే చనిపోయాడు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు.
కాగా.. సోదరి చీటి సకలమ్మ పార్థిమ దేహానికి మాజీ సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను, బంధువులను ఓదార్చారు. కేటీఆర్, కవిత సైతం తమ మేనత్త పార్థివ దేహానికి నివాళి అర్పించారు.
ఇదిలా ఉండగా.. కేసీఆర్‌కు మొత్తం ఎనిమిది మంది సోదరీమణులు ఉన్నారు. వారిలో సకలమ్మ ఐదో సోదరి. సకలమ్మ మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. కాగా.. సకలమ్మ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర గ్రామం. ఆమె మరణంపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. 2018లో కేసీఆర్ రెండో సోదరి విమలాబాయి, మరో సోదరి లీలమ్మ చనిపోయిన విషయం తెలిసిందే.