ప్రమాణానికి రాలేదు.. అసెంబ్లీ సమావేశాలకైనా సారు వస్తారా?
ఇలాంటి వేళ.. ప్రతిపక్ష నేతగా సంప్రదాయాల్నిపాటిస్తూ.. కొత్త విలువల్ని ప్రదర్శిస్తూ అందరికి స్ఫూర్తిగా నిలవాల్సిన అవసరం ఉంది.
రాజకీయ వైరం ఉంటే ఉండొచ్చు. కానీ.. అదేమీ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఎదుటోడు తప్పులు చేయొచ్చు. కానీ.. మనం ఎందుకు తప్పులు చేయాలన్నట్లుగా వ్యవహరించాలి. గతంలో తన నోటి నుంచి వచ్చిన మాటలు.. తాజాగా అందుకు భిన్నమైన చేతలు ప్రదర్శిస్తే.. ప్రజలు ప్రశ్నిస్తారన్న కనీస సోయి లేని తీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఉద్యమ సమయంలో బోలెడన్ని ఆదర్శాలు చెప్పటమే కాదు.. రాష్ట్ర ప్రజలు.. వారి బాగు కోసం సర్దుబాట్లు తప్పవన్నట్లుగా మాట్లాడేవారు.
అలాంటి ఆయన.. మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి తెలంగాణలో కొత్త తరహా వాల్యూ సిస్టం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్న మాటను తరచూ వాడేవారు. ఇందులో భాగంగా సత్ సంప్రదాయాల్ని విధిగా ఆచరించాలన్నట్లుగా ఆయన మాటలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి పదేళ్ల పాటు నాన్ స్టాప్ ముఖ్యమంత్రిగా.. తిరుగులేని అధికారాల్ని వెలగబెట్టిన గులాబీ బాస్..రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రతిపక్షంలో ఉండే పరిస్థితి. ఇలాంటి వేళ.. ప్రతిపక్ష నేతగా సంప్రదాయాల్నిపాటిస్తూ.. కొత్త విలువల్ని ప్రదర్శిస్తూ అందరికి స్ఫూర్తిగా నిలవాల్సిన అవసరం ఉంది.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం చేస్తున్న వేళ.. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానాన్ని పంపారు. ఇలాంటి వేళలో.. ప్రమాణస్వీకారోత్సవానికి రావటం ద్వారా సత్ సంప్రదాయాన్ని షురూ చేయటమే కాదు.. విలువల్ని కాపాడే విషయంలో తాను ముందు ఉంటానన్న సందేశాన్ని ఇచ్చిన వారు అయ్యేవారు.
అలాంటిదేమీ లేకుండా.. రాజకీయ వైరాన్ని వ్యక్తిగతంగా తీసుకున్న కేసీఆర్.. ప్రమాణస్వీకారోత్సవానికి డుమ్మా కొట్టటం ద్వారా దరిద్రపుగొట్టుసంప్రదాయానికి తెర తీశారని చెప్పాలి. మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి రాజకీయ వైరాన్ని వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లేలా కేసీఆర్ తీరు ఉండటం రాష్ట్రానికి బ్యాడ్ లక్ గా చెప్పక తప్పదు. ఈ రోజున కేసీఆర్ డుమ్మా కొట్టిన వైనం చూసినప్పుడు.. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాదిరే కొత్త తరహా రాజకీయానికి తెర తీసినట్లైంది.