కామారెడ్డి మీదే కేసీయార్ ఫుల్ ఫోకస్...!

కేసీయార్ రెండు సీట్లలో పోటీ చేస్తున్నారు. రెండు సీట్లలోనూ ఆయనే స్వయంగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు.

Update: 2023-11-09 03:45 GMT

కేసీయార్ రెండు సీట్లలో పోటీ చేస్తున్నారు. రెండు సీట్లలోనూ ఆయనే స్వయంగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారు ఒకేసారి రెండు సీట్లలో పోటీ చేస్తే ఒక చోటనే వారు నామినేషన్ దాఖలు చేసి రెండవ చోట తమ వారి చేత రిటర్నింగ్ ఆఫీసర్ కి అవి అందిస్తారు.

కేసీయార్ బీయారెస్ అధినేత, బీయారెస్ నాయకులే చెప్పినట్లుగా ఆయన తెలంగాణా సింహం, అంతే కాదు ఏకే 47. అలాంటి నాయకుడు రెండు చోట్లా తానే స్వయంగా నామినేషన్లను దాఖలు చేసేందుకు రెడీ అయ్యారు. గురువారం కేసీయార్ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

గురువారం ఉదయం ఆయన గజ్వేల్ కి వెళ్ళి అక్కడ నామినేషన్లు అందచేస్తారు. ఆ మీదట మధ్యాహ్నానికి కామారెడ్డికి చేరుకుంటారు. అక్కడ ఆర్డీవో ఆఫీసులో తన నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. ఇక చూస్తే అంతా ముహూర్తం ప్రకారేమే కేసీయార్ చేయనున్నారు. ఆయన ఈ నెల 3వ తేదీన సిద్ధిపేటలోని తన ఇష్ట దైవం వెంకటేశ్వరస్వామి వారి ముందు రెండు నామినేషన్ పత్రాలను నింపారు.

అది కేసీయార్ కి అనాదిగా వస్తున్న ఆచారం. ఇక కేసీయార్ గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేసినా ఆయన కామారెడ్డి మీదనే ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఎలా అంటే ఆయన కామారెడ్డిలోనే బహిరంగ సభను ఏర్పాటు చేసి మాట్లాడనున్నారు. కామారెడ్డిలో కేసీయార్ ప్రసంగంతో కదం తొక్కనున్నారని తెలుస్తోంది.

కామారెడ్డిలో ఎందుకు అంటే అక్కడ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అంతే కాదు, రేవంత్ రెడ్డి బస్తీ మే సవాల్ అని అంటున్నారు. గజ్వేల్ బాధ్యతలను మంత్రి హరీష్ రావు చూసుకుంటున్నారు. కామారెడ్డిలో కుమార్తె కవిత బాధ్యలను చూస్తున్నా అక్కడ టఫ్ ఫైట్ జరగనుందని బీయారెస్ నేతలు ఊహిస్తున్నారో ఏమో తెలియదు కానీ కేసీయార్ అయితే కామారెడ్డినే కొట్టాలని బాగా డిసైడ్ అయినట్లు ఉంది.

గజ్వేల్ లో ఈటెల రాజేందర్ పోటీగా ఉన్నారు. ఆయన బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. దాంతో పెద్దగా ఇబ్బంది లేదు అని అనుకుంటున్నారా అన్నది చర్చగా ఉంది. గజ్వేల్ లో అరవై వేలకు పైగా మెజారిటీ కేసీయార్ కి గతంలో వచ్చింది. ఈసారి కొంచెం తగ్గినా లేక అలాగే ఉన్నా గజ్వేల్ సీటు పదిలం అని అంటున్నారు.

అదే కామరెడ్డిలో చూస్తే గట్టిగానే పోటీ ఉంటుంది అని తెల్సుతోంది. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం రెండు సార్లు బీయారెస్ గెలిచింది. అయినా సరే టీడీపీకి మంచి పట్టుంది. కాంగ్రెస్ కి కూడా బలం ఉంది. ఇక రేవంత్ రెడ్డి పోటీకి దిగుతున్నారు అంటే కాంగ్రెస్ కూడా అన్నీ ప్రిపేర్ అయి వస్తుంది.

దాంతో పాటు మైనారిటీలు ఈసారి కాంగ్రెస్ కి మొగ్గు చూపుతారు అని అంటున్నారు. ఇక టీడీపీ ఓట్లు ఇప్పటిదాకా బీయారెస్ కి పడుతూ వచ్చేవి. ఇపుడు మారిన రాజకీయంలో కాంగ్రెస్ వైపు ఆ పార్టీ సానుభూతిపరులు చూసే అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న నాయకుడు. ఆయనకు అలా పరిచయాలు చాలా ఉన్నాయి.

ఇలా ఏ విధంగా చూసినా కామారెడ్డి లో హోరా హోరీ పోరు సాగనుంది. అందుకే కేసీయార్ కోరి మరీ అక్కడే మీటింగ్ పెట్టారని అంటున్నారు. మొత్తానికి కేసీయార్ రెండు సీట్లలో తన బలం ఎక్కడ ఎక్కువ పెట్టాలో డిసైడ్ అయినట్లుగా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News