నాలుగున్నర గంటల పాటు శ్రమించి కేసీఆర్ సర్జరీ పూర్తి

బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ను ఎన్నిక చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ఈ రోజు (శనివారం) వెలువడనుంది

Update: 2023-12-09 03:52 GMT

కొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు చెక్ పెట్టేస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటంతో అప్పటివరకు అధికార పార్టీగా వ్యవహరించిన బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుంది. కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధిస్తే.. బీఆర్ఎస్ 39స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎవరు వ్యవహరిస్తారు? అన్నది చర్చగా మారింది.

దీనికి కన్ఫ్యూజన్ ఎందుకంటే.. బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరించరని.. ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టే వీలు లేదన్న చర్చ మొదలైంది. ఇలాంటి ప్రచారాలు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ వర్సిటీల్లోనూ పెద్ద ఎత్తున జరిగాయి. అయితే.. దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని బీఆర్ఎస్.. తాజాగా మాత్రం ఒక కచ్ఛితమైన సందేశాన్ని ప్రజలకు తెలియజేసే పనిలో పడ్డారు.

బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ను ఎన్నిక చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ఈ రోజు (శనివారం) వెలువడనుంది. అయితే.. అనూహ్య పరిస్థితుల్లో ఫాంహౌస్ బాత్రూంలో కేసీఆర్ కాలుజారి పడటంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించటం తెలిసిందే. శుక్రవారంసాయంత్రం ఆయనకు శస్తచికిత్స చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కోలుకోవటానికి 6 -8 వారాల వరకు సమయం పట్టనుంది.

దీంతో.. శనివారం జరిగే అసెంబ్లీసమావేశాలకు కేసీఆర్ హాజరు కారు. అయితే.. ఆయన్ను బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానాన్నిఆమోదించనున్నారు. అంతేకాదు.. అనారోగ్య కారణాల వల్ల కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసే పరిస్థితుల్లో లేకపోవటం తెలిసిందే. అయితే.. మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుఅసెంబ్లీకి హాజరై.. ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేయనున్నారు.

Tags:    

Similar News