కేసీయార్ మరో మర్రి చెన్నారెడ్డి...!?
ఇబ్బంది కలిగించే నాయకులను ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పదవి అప్పగించి వారిని పూర్తిగా బిజీ చేసేది.
కాంగ్రెస్ దేశమంతా అధికారంలో ఉన్నపుడు ఉన్న పార్టీలోనే పది గ్రూపులు ఉండేవి. దాంతో ఏ నాయకుడి నుంచి పార్టీ అధికారానికి ముప్పు వాటిల్లుతుందో అని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వేయి కళ్లతో చూస్తూ ఉండేది. ఇబ్బంది కలిగించే నాయకులను ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పదవి అప్పగించి వారిని పూర్తిగా బిజీ చేసేది. అలా చేయకపోతే వారు తామున్న రాష్ట్రంలో రాజకీయ మంటలు పుట్టించేవారు.
చరిత్రలో చూసుకుంటే కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి చెన్నారెడ్డి అలాగే హై కమాండ్ కి కొరకరాని కొయ్యగా ఉండేవారు అని ఫ్లాష్ బ్యాక్ కధలను చెబుతారు. మర్రి చెన్నారెడ్డికి పదవి లేకపోతే సొంత పార్టీలో అసమ్మతి రేపేవారు అని కూడా గత చరిత్రలో ఉందని అంటారు. మర్రి చెన్నారెడ్డి 1960 దశకం చివరలో ప్రత్యేక తెలంగాణా అంటూ అతి పెద్ద ఉద్యమాన్ని లేవదీశారు అని కూడా అంటారు.
అలా ఉద్యమం మూడేళ్ళ పాటు సాగింది. ఆ తరువాత మర్రి చెన్నారెడ్డి విలువ ఏంటో నాటి కాంగ్రెస్ నాయకత్వానికి తెలిసి ఆయనను కేంద్రంలోనో లేక రాజ్ భవన్ లో గవర్నర్ గానో ఏదో ఒక పదవి ఇచ్చేవారు అని చెబుతారు. ఇదంతా ఎందుకు అంటే కేసీఆర్ గురించి. ఆయన అత్యంత ప్రమాదకారి అని ఒక సీరియస్ డైలాగ్ వేసింది రాజకీయ ప్రత్యర్ధులు కారు, బయటవారు అంతకంటే కారు.
ఆయన కుమారుడు కేటీఆర్. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండడమే అత్యంత డేంజర్ అని కేటీఆర్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. అంతే కాదు సీఎం అన్న రెండు అక్షరాల కన్నా కేసీఆర్ అన్న రెండు అక్షరాలే వెరీ పవర్ ఫుల్ అని కూడా మరో మాట చెప్పారు.
ఇక కేసీఆర్ ఎపుడు ప్రజలలోకి వస్తారో కూడా కేటీయార్ చెప్పారు. ఫిబ్రవరి నెలలో జనంలోకి కేసీఆర్ వస్తారు అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎంపీ ఎన్నికల ముందు జనంలోకి కేసీఆర్ వస్తారు అన్న మాట. కేసీఅర్ అంటే రాజకీయ గండర గండడు అని వేరే చెప్పాల్సింది లేదు ఆయన వ్యూహాలు కూడా పదును తేరి ఉంటాయి.
తెలంగాణాలో కాంగ్రెస్ బొటాబొటీ మెజారిటీతో అధికారంలో ఉంది. ఒక వింత కూర్పు కాంగ్రెస్ లో ప్రభుత్వాన్ని అలా నిలబెట్టి ఉంచింది. ఇక కేంద్రమో మరోసారి బీజేపీ గెలిస్తే అపుడు కేసీఅర్ ఆట స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు ఎందుకంటే బీజేపీతో ఎలా రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేయాలో లెక్క చూసుకుని మరీ కేసీఆర్ రంగంలోకి దిగుతారు అని అంటున్నారు.
అంతేకాదు ఆయనకు కూడా మర్రి చెన్నారెడ్డి మాదిరిగా అద్భుతమైన రాజకీయ తెలివి తేటలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మర్రి చెన్నారెడ్డికి వారసుడి అని చెప్పాలి. చెన్నారెడ్డి వదిలేసిన తెలంగాణా ఉద్యమాన్ని కొనసాగించిన వారు కేసీఆర్. అందులో ఆయన విజయవంతం సాధించారు కూడా.
ఇక కేసీఆర్ ఇపుడు చూసేసి సరైన సమయం కోసం. అదను దొరకాలి కానీ జనం నాడి పట్టుకుని ఆయన రాజకీయంగా దూకుడు చేస్తారు అన్నది ఒక విశ్లేషణగా ఉంది. రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలని విపక్షంలో ఉంటూ ముప్పతిప్పలు పెట్టిన కేసీఅర్ కి ఇపుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఎదురుగా ఉంది. మరి కేసీఅర్ జనంలోకి వచ్చాక ఏమి జరుగుతుంది అన్నది రాజకీయ వెండి తెర మీద చూడాల్సిందే.