పాతిక కార్లు పట్టేంత పెద్ద ఇల్లు కేసీఆర్ కు కావాలట!
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో తాను ఉండేందుకు ఇల్లు కావాలన్న ఆయన.. అందుకు వీలుగా కొన్ని కండీషన్లు చెప్పినట్లుగా చెబుతున్నారు.
ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు తనకు అనువైన ఇంటి కోసం వెతుకుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో తాను ఉండేందుకు వీలుగా ఇల్లు అవసరమన్న విషయాన్ని తనను కలిసిన ఎమ్మెల్యేలతో చెప్పినట్లుగా చెబుతున్నారు. లంకంత ప్రగతి భవన్ లో దాదాపు ఆరేడేళ్లు ఉన్న ఆయన.. ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో దాన్ని ఖాళీ చేయటం తెలిసిందే. ఫలితాలు వచ్చిన రోజునే ప్రగతిభవన్ నుంచి వెళ్లిపోయిన ఆయన.. ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ఉంటున్నారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో తాను ఉండేందుకు ఇల్లు కావాలన్న ఆయన.. అందుకు వీలుగా కొన్ని కండీషన్లు చెప్పినట్లుగా చెబుతున్నారు. కనీసం పాతిక కార్లు పార్కింగ్ ఉండేందుకు అనువైన ఇల్లు కావాలన్నది ఆయన అభిలాష. చుట్టూ పక్కన వారికీ ఇబ్బంది లేకుండా నన్ను కలవడానికి వచ్చే వారికీ కార్ పార్కింగ్ అనువుగా ఉండాలి అనేది ఆయన కండిషన్ అంట. ఈ సందర్భంగా ఆయన కాస్తంత ఎమోషన్ అయినట్లు తెలుస్తోంది. తన హయాంలో ప్రగతిభవన్ కట్టించా.. కొత్త సెక్రటేరియట్ ను సుందరంగా నిర్మించిన తాను సొంతానికి ఒక ఇల్లు కూడా కట్టుకోలేదని ఫీల్ అయినట్లుగా చెబుతున్నారు. దీంతో.. హైదరాబాద్ కు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే కలుగజేసుకొని.. తన ఇంటిని ఇస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది.
తానీ మధ్యనే కొత్త ఇల్లు కట్టించానని.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నబంజారాహిల్స్ లో ఆ ఇల్లు ఉందని.. అత్యాధునిక వసతులతోఉన్న ఆ ఇంట్లోకి వస్తే బాగుంటుందన్న మాట ఆయన నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. దీనికి స్పందించిన కేసీఆర్..కనీసం పాతిక కార్లు పట్టేంత పార్కింగ్ స్పేస్ ఉన్న ఇల్లు అవసరమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనను కలిసేందుకు వచ్చే వారితోనూ.. భేటీలకు అనుగునంగా ఉండేలా ఆ మాత్రం ఇల్లు ఉండాలని చెబుతున్నారు. కేసీఆర్ ఆలోచనలు ఎంత భారీగా ఉంటాయో తెలిసిందే.
ముఖ్యమంత్రి అధికార నివాసం కోసం కేసీఆర్ సర్కారు నిర్మించిన ప్రగతిభవన్ దాదాపు లక్ష చదరపుఅడుగులు ఉండటంతో పాటు ఏడు ఎకరాల విస్తీర్ణంలోనిర్మించారు. అందులోకేసీఆర్ ఉన్న నివాసం 15వేల చదరపు అడుగులు ఉంటుంది. అంత పెద్ద ఇంట్లో ఏళ్లకు ఏళ్లుగా అలవాటైనప్పుడు.. ఇప్పుడు ఎంత పెద్ద బంగ్లా అయినా దాని సాటికి రాదు కదా? అదే ఇప్పుడు కేసీఆర్ కు సమస్యగా మారిందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాతిక కార్ల పార్కింగ్ పట్టేందుకు ఇల్లు హైదరాబాద్ లో ఎంచుకోవటం కాస్త కష్టమైన పనే చెబుతున్నారు. తమ అధినేత అవసరాలకు తగ్గట్లుగా ఉండే ఇంటి కోసం హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.