సెంట్ భూమి కూడా లేని కేసీయార్ ...మరి ఫామ్‌ హౌస్...?

కేసీయార్ తెలంగాణా సీఎం. బీయారెస్ అధినేత. జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించాలనుకుంటున్నారు.

Update: 2023-11-10 03:42 GMT

కేసీయార్ తెలంగాణా సీఎం. బీయారెస్ అధినేత. జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించాలనుకుంటున్నారు. అలాంటి నాయకుడు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర ఉన్న నేతకు సెంట్ భూమి కూడా తెలంగాణాలో లేదా అంటే లేదు అని ఆయన అఫిడవిట్ చెబుతోంది. కేసీయార్ 2023 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తూ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో ఇదే విషయం చెప్పారు.

కేసీయార్ కేరాఫ్ ఫామ్‌ హౌస్ అని విపక్షాలు తెల్లారి లేస్తే విమర్శలు చేస్తాయి. ఈ ఫామ్‌ హౌస్ ఎంతటి విస్తీర్ణంలో ఉంది అంటే రెండు నుంచి మూడు వందల ఎకరాల దాకా ఉంటుంది అని ఒక అంచనా కడుతున్నారు. ఇంకా ఎక్కువ కూడా అన్న వారూ ఉన్నారు. పైగా ఇది అత్యంత ఖరీదైన భూమి అని కూడా చెబుతున్నారు.

మరి ఇంతటి విలువైన ఫామ్‌ హౌస్ కేసీయార్ ది కాదా అంటే కాదు అంటోంది అఫిడవిట్. దాన్ని మొత్తం కుటుంబానికి చెందిన ఆస్తిగా చూపుతున్నారు. అందువల్ల అది కేసీయార్ పేరు మీద లేదని అంటున్నారు. ఇక మొత్తం కుటుంబానికి ఉన్న భూమి ఎంత అంటే అది కూడా అరవై రెండు ఎకరాలుగా లెక్క చెబుతున్నారు.

ఈ భూమిలో మొత్తం 53.30 ఎకరాలు సాగు భూమిగా ఉండగా 9.36 ఎకరాల భూమి వ్యవసాయేతర భూమిగా పేర్కొన్నారు. ఇవన్నీ కూడా హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన ఆస్తులు అని కేసీయార్ ప్రకటించారు.అంటే ఆయన పేరుగా ఏ భూమి లేదు అని అంటున్నారు.

అలా కనుక చూస్తే సెంట్ భూమి కూడా కేసీయార్ పేరు మీద లేదు అనే అఫిడవిట్ చెబుతోంది. ఇలా కేసీయార్ పేరు మీద భూమి ఏదీ లేదని అంటున్నారు. అయితే దీని మీద కూడా అపుడే ప్రత్యర్ధులు విమర్శలకు ఆస్కారం ఏర్పడుతోంది. అదెలా అంటే అప్పట్లో కేసీయార్ ఎర్రవెల్లి గ్రామంలోకి 54 ఎకరాల వ్యవసాయ భూమిని తన పేరున ఉన్నట్లుగానే చూపించారు అని అంటున్నారు.

అయితే ఇపుడు మాత్రం సెంట్ జాగా లేని సీఎం గా ఆయన అవిడవిట్ లో పేర్కొన్నారు. దీంతో కేసీయార్ ఫామ్‌ హౌస్ అని ఎందుకు అంటున్నారు. అసలు ఆ విమర్శలకు అర్ధం ఉందా అన్న చర్చ కొత్తగా మొదలైంది. భూములు అన్నీ కుటుంబానివే కేసీయార్ పేరున ఏమీ లేదు అని మాత్రమే అనుకోవాలి. లేక ఈ అయిదేళ్ళలో ఆయన భూమిని మొత్తం కుటుంబానికి పంచేశారు అని భావించాలి అనుకోవాలి. ఇక కేసీఆర్ కు ఆస్తులు ఉన్నా అప్పులు కూడా ఉండడం మరో విశేషం. ఏది ఏమైనా కేసీయార్ ఒక సాదా సీదా రాజకీయ నాయకుడు అని ఆయన అఫిడవిట్ చూస్తే అర్ధం అవుతోంది

Tags:    

Similar News