కేసీయార్ ప్లాన్ వర్కవుటవుతుందా ?

రాబోయే ఎన్నికల్లో గెలుపు టార్గెట్ గానే కేసీయార్ హడావుడిగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు.

Update: 2023-10-25 05:19 GMT

రాబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్నది కేసీయార్ టార్గెట్. అయితే అందుకు పరిస్ధితులు అనుకూలంగా ఉన్నాయా అన్నదే పెద్ద సందేహం. ఎందుకంటే పోయిన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీల్లాగే రైతురుణమాఫీ హామీ కూడా ఇంతవరకు సంపూర్ణంగా అమలుకాలేదు. దాంతో లక్షలాది రైతులు కేసీయార్ అంటేనే మండిపోతున్నారు. అందుకనే రైతులను ప్రసన్నం చేసుకునేందుకు కేసీయార్ పెద్ద వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ వ్యూహం ఏమిటంటే రైతు రుణామాఫీ కోసం రైతుల ఖాతాల్లో డబ్బులు వేయటానికి కేంద్ర ఎన్నికల కమీషన్ అనుమతి కోరుతు లేఖ రాయబోతున్నారట.

రాబోయే ఎన్నికల్లో గెలుపు టార్గెట్ గానే కేసీయార్ హడావుడిగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. ఎక్కడెక్కడి నిదులను తీసుకొచ్చి రుణమాఫీకి ఉపయోగిస్తున్నదంతా అచ్చంగా ఎన్నికల కోసమని అందరికీ తెలిసిందే. ఎన్నికల్లోగా రుణమాఫీ చేయకపోతే రాబోయే ఎన్నికల్లో రైతుల రియాక్షన్ ఎలాగుంటుందో కేసీయార్ కు ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదు. ఇప్పటికే రుణమాఫీ విషయంలో మంత్రులు, ఎంఎల్ఏలను రైతులు చాలాచోట్ల నిలదీస్తున్న విషయం తెలిసిందే.

ఇపుడు కొత్త ఎత్తు ఏమిటంటే తాను రుణమాఫీ కోసం నిధులను రెడీచేసి రైతుల ఖాతాల్లో వేద్దామని అనుకుంటే సడెన్ గా ఎన్నికల కోడ్ అడ్డమొస్తోందని చెప్పుకుంటున్నారు. ఎన్నికల కోడ్ లేకపోతే రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడో డిపాజిట్ అయ్యేదని కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కేసీయార్ చెబుతున్నారు. మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఏమిచేశారంటే మళ్ళీ సమాధానముండదు. తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని అందరు అనుకుంన్నదే. అయినా రుణమాఫీ పూర్తిగా చేయకుండా కేసీయార్ చాలా రిలాక్సుడుగా ఉన్నారు.

ఇపుడు ఇదే విషయమై తొందరలోనే కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ రాయాలని అనుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం. కమీషన్ అనుమతిస్తే నిధులు రైతుల ఖాతాల్లో వేసేట్లు లేకపోతే ఎన్నికల్లో గెలిచిన తర్వాత వేసేట్లుగా కేసీయార్ ప్లాన్ చేస్తున్నారట. అసలు ఈ ప్లానంతా ఎన్నికల్లో గెలిచేందుకే అని తెలిసిన తర్వాత డబ్బులు వేయకపోయినా గెలిస్తే తర్వాత రైతులను కేసీయార్ పట్టించుకుంటారా ? ఓట్లు వేయరన్న భయంతోనే కదా హడావుడిగా మొన్నటివరకు డబ్బులను రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేసింది. మరిపుడు కేసీయార్ వ్యూహం వర్కవుటవుతుందో లేదో చూడాల్సిందే

Tags:    

Similar News