సినిమాలు చూసి మరణశిక్షలు వేస్తున్న కిమ్... వైరల్ గా లేటెస్ట్ శిక్ష!

అవును... ఎక్కడ కననీ, విననీ స్థాయిలో అన్నట్లుగా తాజాగా కిం అమలుచేసిన ఒక శిక్ష ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది

Update: 2023-10-18 00:30 GMT

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నియంతృత్వ పోకడలతో కూడిన పరిపాలనా విధానం, నరకాన్ని మించి అన్నట్లుగా సాగే వికృత శిక్షణల సంగతి తెలిసిందే. ఈ స్థాయి నియంతృత్వ పోకడలతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంటాడు. అప్పుడప్పుడు అణుబాంబూలతో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన అమలు పరిచిన ఒక శిక్ష చర్చనీయాంశం అయ్యింది.

అవును... ఎక్కడ కననీ, విననీ స్థాయిలో అన్నట్లుగా తాజాగా కిం అమలుచేసిన ఒక శిక్ష ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. గతంలో హాలీవుడ్ సినిమాల్లో చూపించిన స్థాయిలో శిక్ష ఉందని.. కాకపోతే ఇంత దారుణంగా ఒక మనిషి, మరో మనిషికి ఇలాంటి శిక్షలు ఎలా వేస్తారనేది మరింత భయంకరమైన ఆలోచనగా ఉందని అంటుంటారు. ఈ నేపథ్యంలో సైన్యంలోని ఓ జనరల్ స్థాయి అధికారిని అత్యంత పైశాచికంగా హత్య చేసిన సంగటన వెలుగులోకి వచ్చింది.

వాస్తవానికి ప్రపంచం కిమ్ ని నియంత అనుకుంటుంది కానీ... ఆ ప్రాంత ప్రజలు అలా భావించరని చెబుతుంటారు. కారణం... అతనో నియంత అనే విషయం కూడా అక్కడి ప్రజలకు అవగతం కాదట. అతని నాన, తాతలను అక్కడ దేవుళ్లుగా కొలుస్తుంటారు. దీంతో... ఇతడు కూడా అక్కడ కలియుగ దైవంతోనే సమానం అన్నమాట!

ఇదిలా ఉంటే కిం అక్కడ అమలు చేసే శిక్షల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అని ఇప్పటికే ఎన్నో ఉదాహరణలు ప్రపంచం చూసిన సంగతి తెలిసిందే. ఇక రూల్స్ విషయానికొస్తే... సౌత్ కొరియాలో సినిమాలు చూసినా, ఏదైనా మతాన్ని పాటించినా, సోషల్ మీడియా వంటివి ఉపయోగించినా, కనీసం పాటలు విన్నా కూడా అక్కడి అత్యంత పెద్ద నేరంతో సమానం. ఇక శిక్షల సంగతి చెప్పేదేముంది!

ప్రస్తుతం తాజా విషయానికొస్తే... తిరుగుబాటుకు పాల్పడుతున్నాడనే అనుమానంతో సైన్యంలోని ఓ జనరల్ స్థాయి అధికారిని అత్యంత పైశాచికంగా హత్య చేయించాడు కిమ్. ఇందులో భాగంగా... మాంసాన్ని ఆహారంగా తీసుకునే అత్యంత ప్రమాదకరమైన "పిరాన్హా" చేపలకు ఆ అధికారిని ఆహారంగా వేసినట్లు డైలీస్టార్ నివేదించింది. ముందుగా అతని కాళ్లు, చేతులు నరికించేసిన కిమ్... అనంతరం పిరాన్హా చేపలు ఉన్న కొలనులో పడేసి చంపేశారట.

ఇంతకీ అతనికి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటారా? ఉత్తర కొరియా నియంత కిమ్‌ కు 1977 జేమ్స్ బాండ్ చిత్రం "ది స్పై హూ లవ్డ్ మీ" నుండి దేశద్రోహులకు అలాంటి మరణాన్ని ఇవ్వాలనే ఆలోచన వచ్చిందట. ఈ చిత్రంలో, విలన్ కార్ల్ స్ట్రోమ్బెర్గ్ తన శత్రువులను పెద్ద సంఖ్యలో ప్రమాదకర చేపలు ఉన్న ట్యాంక్‌ లోకి విసిరి చంపుతాడు. ఇదే టైంపులో కిమ్ కూడా శిక్షలు అమలు చేస్తున్నాడంట.

కాగా... 2011లో అధికారం చేపట్టినప్పటి నుంచి మొత్తం 16 మంది సీనియర్‌ అధికారులకు కిం ఈ తరహా మరణశిక్ష విధించాడట. ఇక అత్యంత పదునైన దంతాలు కలిగిన పిరాన్హా చేపలు కొన్ని నిమిషాల్లో మానవ శరీరాలను ముక్కలు చేసి మాంసాన్ని తినగలవు! దీంతో... ఇంటి సమీపంలోనే పెద్ద పూల్ లో వీటిని పెంచుతున్నాడంటం కిమ్!

Tags:    

Similar News