ఏపీలో అధికారం వారిదే అంటున్న మాజీ సీఎం !
దాదాపుగా పుష్కర కాలం పాటు రాజకీయంగా ఏ వెలుగులూ లేని ఆ నాయకుడికి 2024 ఎన్నికలు కలసివస్తాయా అన్న చర్చ సాగుతోంది
దాదాపుగా పుష్కర కాలం పాటు రాజకీయంగా ఏ వెలుగులూ లేని ఆ నాయకుడికి 2024 ఎన్నికలు కలసివస్తాయా అన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ నో అనూహ్యంగా మూడేళ్ళ పాటు సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. తిరిగి ఆ పార్టీలో చేరారు. మళ్ళీ బయటకు వచ్చారు. ఇలా ఎంతో ఆలోచన చేసిన మీదట ఆయన బీజేపీలో చేరారు.
బీజేపీ ఆయనను తగిన తీరున గౌరవించింది. రాజంపేట నుంచి ఆయనను పోటీలో దించింది. ఎంపీగా పోటీ చేసిన నల్లారికి టీడీపీ కూటమి నుంచి ఎంత మేరకు సాయం లభించింది. ఆయన గెలుపు అవకాశాలు ఏమిటి అన్న చర్చ అయితే సాగుతోంది.
ఎందుకంటే రాయలసీమలో వైసీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. దాంతో పాటు రాజంపేట నుంచి ఓటమి లేని నేతగా మిధున్ రెడ్డి రెండు సార్లు గెలుస్తూ వచ్చారు. ఆ సీటు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయడంతో లెక్కలు మారిపోయాయా అన్న చర్చ కూడా ఉంది.
ఇదిలా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు మీద ఉన్న అంచనాలు ఏమిటి అన్నదే ఇపుడు అంతా చర్చినుకుంటున్నారు. పోలింగ్ తరువాత మొత్తం సమీక్షించుకున్న మాజీ సీఎం కిరణ్ పార్టీ శ్రేణులను తన వద్దకు వచ్చిన నాయకులను ఉదేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం అయితే లేదు, ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతోంది అని కిరణ్ ఘంటాపధంగా చెప్పారని అంటున్నారు.
అదే విధంగా కొన్ని పోలింగ్ కేంద్రాలలో వైసీపీ దౌర్జన్యం చేసిందని అయినా సరే ఎవరూ భయపడాల్సింది లేదు, వచ్చేది మనమే అందరి లెక్కలూ సరిచేద్దామని మాజీ సీఎం అన్నట్లుగా చెబుతున్నారు. రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో గెలుపు ధీమా వ్యక్తం చేశారు అని అంటున్నారు.
అదే కనుక నిజం అయితే ఆయన బీజేపీ నుంచి ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మూడవసారి ఏర్పడే మోడీ ప్రభుత్వంలో కచ్చితంగా మంత్రి అవుతారు అని అంటున్నారు. ఆయన సామాజిక నేపధ్యం, రాజకీయ అనుభవంతో పాటు రాయలసీమ నుంచి ఉన్న ఈక్వేషన్స్ అన్నీ కలసి ఆయనకు మంచి శాఖతో కేంద్ర మంత్రి పదవిని కట్టబెడతాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కిరణ్ తక్కువగా మాట్లాడుతారు.
ఆయన పోలింగ్ ముగిసిన తరువాత అన్ని వైపుల నుంచి వేసుకున్న లెక్కలను చూసుకున్న మీదటనే తన గెలుపు మీద ధీమా వ్యక్తం చేశారు అని అంటున్నారు. అంతే కాదు ఏపీలో రాజకీయం మారుతోంది అని కూడా ఆయన చెబుతున్నారు అంటే కిరణ్ లెక్కలు అంచనాలు ఎంత మేరకు కరెక్ట్ అవుతాయన్నది జూన్ 4న ఫలితాలు వచ్చాక బేరీజు వేసుకోవాల్సిందే అంటున్నారు.