కిష‌న్ రెడ్డికి 'నీట్ సెగ‌'!

అయిన‌ప్ప‌టికీ.. నీట్ కౌన్సెలింగ్‌ను ర‌ద్దు చేయాల‌న్న‌ది దేశ‌వ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న డిమాండ్. దీనికి ఇటు కేంద్రం.. అటు సుప్రీంకోర్టు కూడా.. స‌మ్మ‌తించ‌డం లేదు.

Update: 2024-06-22 08:28 GMT

కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ నాయ‌కుడు కిష‌న్‌రెడ్డి 'నీట్‌' సెగ‌త‌గిలింది. హైదరాబాద్ కాచి గూడలోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు శ‌నివారం ఉదయం ఆందోళన చేపట్టా యి. నీట్‌ పరీక్షను రద్దు చేయా లనే డిమాండ్‌తో పలు సంఘాల నేతలు ఆయన ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఆయనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నల్లకుంట పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఏంటి వివాదం?

ఎంబీబీఎస్‌, ఎండీ, ఎమ్మెస్ వంటి వైద్య విద్య‌కు సంబంధించి జాతీయ‌స్థాయిలో(నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఏటా నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ ఎంట్ర‌న్స్ (నీట్‌) నిర్వ‌హిస్తుంది. దీని ఆధారంగానే వైద్య విద్య చ‌దివేం దుకు.. విద్యార్థుల‌కు అర్హ‌త క‌ల్పిస్తారు. గ‌తం నుంచి కూడా నీట్ ప‌రీక్ష‌పై అనేక ఆరోప‌ణ‌లు వున్నాయి. అయితే.. ఈ సారి ఏకంగా ప‌రీక్ష పేప‌ర్ లీక్ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. జాతీయ స్థాయిలో ఇది ఇప్ప‌టికీ తీవ్ర వివాదంగానే ఉంది. ఇప్ప‌టికే ప‌లువురు విద్యార్థుల‌ను.. లీక్ చేసిన‌ట్టుగా భావిస్తున్న అధికారుల‌ను కూడా అరెస్టు చేశారు.

అయిన‌ప్ప‌టికీ.. నీట్ కౌన్సెలింగ్‌ను ర‌ద్దు చేయాల‌న్న‌ది దేశ‌వ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న డిమాండ్. దీనికి ఇటు కేంద్రం.. అటు సుప్రీంకోర్టు కూడా.. స‌మ్మ‌తించ‌డం లేదు. ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసేందుకు.. కౌన్సిలింగ్‌ను వాయిదా వేసేందుకు కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఇక‌, దేశ‌వ్యాప్తంగా ఇంత అల‌జ‌డి రేగినా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న మౌనాన్ని వీడ‌డం లేదు. దీంతో విద్యార్థులు ఎక్క‌డిక‌క్క‌డ విజృంభిం చి.. త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

దీనిలో భాగంగానే.. తాజాగా కిష‌న్ రెడ్డి ఇంటిని ముట్ట‌డించారు. నీట్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని.. విద్యార్థులు ఆందోళ‌న చేస్తున్నారు. దీనికి బీఆర్ ఎస్ కూడా జ‌త‌క‌ల‌వ‌డంతో రాజ‌కీయ దుమారం రేగింది. ప్ర స్తుతం ఈ వివాదంపై కేంద్రం దృష్టి పెట్టినా.. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. కేవ‌లం చూస్తా.. చేస్తాం.. ఎంత‌టి వారున్నా.. వ‌ద‌లి పెట్టం.. అనే సంకేతాలు మాత్ర‌మే ఇస్తోంది ఈ ప‌రిణామ‌మే విద్యార్థుల‌ను ఆవేద‌న‌కు గురిచేస్తోంది.

Tags:    

Similar News