కొడాలి, బుగ్గన ల విషయంలో ఈసీ కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే.

Update: 2024-04-27 09:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఈ నెల 29 వరకూ నామినేషన్ల విత్ డ్రా లకు అవకాశం ఉంది! ఈ సమయంలో కొన్ని నామినేషన్ల విషయంలో సంచలన విషయాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొడాలి నాని నామినేషన్ పైనా, బుగ్గన రాజేంద్రనాథ్ నామినేషన్ పైనా టీడీపీ ఫిర్యాదులు చేసింది.

అవును... నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి అయ్యింది.. ఇక పూర్తిగా దృష్టంతా ప్రచారంపై పెట్టడమే అని భావిస్తున్న నేపథ్యంలో.. తాజాగా మాజీ మంత్రి, కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌ పై వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి నామినేషన్ పెండింగ్ లో పెట్టారనే విషయం వీవ్ర చర్చనీయాంశం అయ్య్యింది!

ఇందులో భాగంగా... టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి తరఫు న్యాయవాది.. బుగ్గన నామినేషన్ పై అభ్యంతరం తెలిపారు. బుగ్గన తన ఆస్తుల వివరాలు పూర్తిగా వెల్లడించలేదని, నామినేషన్‌ పత్రంలో కొన్ని కాలమ్స్‌ ని భర్తీ చేయలేదని ఫిర్యాదు చేశారు. గుడివాడలోనూ కొడాలి నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్‌ అధికారి కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో... తీవ్ర కలకలం రేగింది.

అలా వైసీపీలో కీలక నేతలు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పంచేసిన వారి నామినేషన్ల విషయంలో ఇలాంటి సమస్యలు తెరపైకి రావడంతో విషయం సీరియస్ గా మారింది. మరోపక్క వైసీపీ శ్రేణుల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే... వారి నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో... వారికి, వారి అనుచరులకు, వైసీపీ శ్రేణులకు బిగ్ రిలీఫ్ దొరికిందని అంటున్నారు.

అవును... కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ ల నామినేషన్లకు ఆమోదం లభించింది. నామినేషన్ పత్రాల్లో వారిద్దరూ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అందిన ఫిర్యాదులను పరిశీలించిన అధికారులు... చివరికి నామినేషన్లను ఆమోదించినట్లు ప్రకటించారు. దీంతో... ఇక ఆ ఇద్దరు నేతలూ పూర్తిగా ప్రచారంపై దృష్టి సారించారని తెలుస్తుంది!

Tags:    

Similar News