రేవంత్ పై కోమటిరెడ్డి ట్వీట్ వైరల్... తెరపైకి కొత్త టెన్షన్!

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు.

Update: 2023-12-06 10:17 GMT

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇప్పటీకే ఫైనల్ చేసేసింది. ఈ సమయంలో రేవంత్ ని ముఖ్యమంత్రిగా ఫైనల్ చేసే సమయంలో ఉత్తం కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదలైన సీనియర్ల నుంచి ఎలాంటి వ్యతిరేకతా రాలేదా.. లేక, వచ్చినా అధిష్టానం కూల్ చేసిందా.. అదీగాక, మంత్రి పదవుల పంపకం వరకూ వీరి ఓపిక, ఓపికగా ఉండబోతుందా అనేది ఆసక్తిగా మారింది. ఈ సమయంలో కోమటిరెడ్డి ఆన్ లైన్ వేదికగా స్పందించారు.

అవును... తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దమవుతోన్న వేళ రేవంత్ తో తొలి నుంచి విభేదిస్తున్న సీనియర్లు ఇప్పుడు స్పీడ్ తగ్గించినట్లే కనిపిస్తున్నారు. వీరిని హైకమాండ్ కూల్ చేసిందా.. లేక, మరో కీలకమైన కారణం ఏమైనా ఉందా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు.

రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి దక్కినప్పటినుంచీ వ్యతిరేకిస్తూ వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు అభినందించారు! సీఎల్పీ లీడర్ గా, ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు కంగ్రాట్యులేషన్స్ బ్రదర్ అంటూ కోమటిరెడ్డి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ను సపోర్ట్ చేసినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కల్వకుంట్ల మోనార్క్ ప్రభుత్వాన్ని దింపి తిరిగి ప్రజాస్వామ్య పాలన వస్తుందని ట్వీట్ చేసారు. దీంతో... ఇప్పట్లో రేవంత్ కు ఇబ్బందులేవీ ఉండకపోవచ్చనే చర్చ మొదలైంది!

ఆ సంగతి అలా ఉంటే... పోర్ట్ ఫోలియోల ఎంపిక అనంతరం తలపోట్లు మొదలవ్వొచ్చనే చర్చ కూడా మరోపక్క మొదలైంది! ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ఎంత కీలకమో అంతకు మించి మంత్రివర్గ కూర్పు మరింత కీలకం అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయంలో పొరపాటున 10మంది అలిగితే మొదటికే మోసం అనే మాటలు వినిపిస్తున్నాయి! ఈ సమయంలో భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన మంత్రి పదవి ఇవ్వనున్నారని తెలుస్తుంది.

ఈ సమయంలో కోమటిరెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి కీలక నేతలకు ఎలాంటి పోర్ట్ ఫోలియోలు దక్కనున్నాయనేది ఆసక్తిగా మారింది.

ఈ సమయంలో కాంగ్రెస్ గతానుభవాలు తన అనుభవాల్లో లేకపోయినా... ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎలాంటి సమస్యలు రాకుండా ముందుగానే సీనియర్లను కలుపుకొని వెళ్లేలా హైకమాండ్ రేవంత్ కు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో రేవంత్ కూడా తగు జాగ్రత్తలు తీసుకునే మంత్రివర్గ కూర్పులో తనవంతు సలహాలూ, సూచనలు ఇచ్చినట్లు సమాచారం!

Tags:    

Similar News