జీ20 సదస్సు భారత్ మండపం వద్ద కోణార్క్ చక్రం... ప్రత్యేకత ఇదే!
ఈ సందర్భంగా ప్రగతి మైదాన్ వేదికగా నూతనంగా నిర్మితమైన భారత్ మండపం వద్ద ప్రపంచ దేశాధినేతలందరితో కరచాలనం చేసి ఆప్యాయంగా స్వాగతించారు.
జీ20 సదస్సుకు వచ్చిన ప్రపంచ నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా స్వయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రగతి మైదాన్ వేదికగా నూతనంగా నిర్మితమైన భారత్ మండపం వద్ద ప్రపంచ దేశాధినేతలందరితో కరచాలనం చేసి ఆప్యాయంగా స్వాగతించారు. ఈ సమయంలో కోణార్క్ చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రూపాయి నోట్లపై కనిపించే ఈ కోణార్క్ చక్రం... 10, 20 నోట్లపైనా కనిపించేది. ఇక కోణార్క్ సూర్య దేవాలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగిఉన్న ఈ చక్రాన్ని 13వ శతాబ్ధంలో రాజు నరసింహదేవ్-1 పాలనలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇది భారతదేశ జాతీయ జెండాలో కూడా కనిపిస్తుంది!
పూర్వం కోణార్క్ ఆలయంలోని ఈ చక్రాన్ని ఆధారంగా చేసుకుని సమయాన్ని లెక్కించేవారని చెబుతుంటారు. ఈ 9 అడుగుల 9 అంగుళాల పరిమాణంలో ఉండే ఈ చక్రంలో 12 జతల చక్రాలు ఉంటాయి. ఇవి సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయని అంటారు. ఇదే క్రమంలో ఆలయంలోని 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయని చెబుతారు.
ఇదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ ఈ కోణార్క్ చక్రం పై ట్విట్టర్ లో స్పందించారు. ఒడిశా రాష్ట్ర సంస్కృతి, వారసత్వానికి జీ-20 సదస్సులో గర్వించదగిన స్థానం కలిగిందని చెప్పారు. ఇదే సమయంలో.. కోణార్క్ చక్ర అనేది భావి, భవిష్యత్తు తరాలకు సంబంధించిన నాగరికతను వివరించే ఓ నిర్మాణ అద్భుతమని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
ఇదే క్రమంలో... అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు భారతదేశ వారసత్వం, విజ్ఞాన సంప్రదాయాల ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోడీ వివరించడం.. ఓ అందమైన దృశ్యంగా ఉందని కేంద్రమంత్రి ట్విట్టర్ లో తెలిపారు.