జగన్ ను సాయిరెడ్డి అంతమాట అన్నారా?
ప్రస్తుతం ఈ అశంపైనే మీడియాలో డిబేట్ లు, లైవ్ షోలు, ప్రెస్ మీట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి.. వీరిపై ఆమె భర్త మదన్ మోహన్ చేస్తున్న సంచలన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అశంపైనే మీడియాలో డిబేట్ లు, లైవ్ షోలు, ప్రెస్ మీట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై తొలుత శాంతి వివరణ ఇచ్చి... తండ్రి సమానులైన సాయిరెడ్డితో ఇలాంటి సంబంధాలు అంటగడతారా అంటూ ప్రశ్నించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టనని విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో శాంతి భర్త మదన్ మోహన్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు.
విజయసాయిరెడ్డి, శాంతి, సంజయ్ మొదలైనవారిపై తీవ్ర ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డి డీ.ఎన్.ఏ. టెస్టుకు రావాల్సిందే అని, ఒక వేళ ఈ టెస్ట్ లో నెగిటివ్ వస్తే అందరిముందూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, క్షమాపణ కోరతానని అన్నారు. ఈ సమయంలో నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పందించారు.
మరోపక్క ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డికి కొంతమంది వైసీపీ నేతలే దెబ్బకొట్టారని.. ఆ దిశగా ప్రయత్నిస్తున్నారని.. అందుకు కారణం జగన్ తో సాయిరెడ్డికి విభేదాలు వచ్చాయని.. అందుకే ఈ విషయంలో జగన్ కూడా లైట్ తీసుకుంటున్నారని చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో స్పందించిన కోటంరెడ్డి... ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్పారు!
అవును... విజయసాయిరెడ్డికి జగన్ కు మద్య గ్యాప్ ఉందంటూ వస్తోన్న కథనాల నేపథ్యంలో తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... గతంలో జగన్ కు సాయిరెడ్డికి మధ్య జరిగినట్లు చెబుతూ ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు.
ఇందులో భాగంగా... విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసిన సమయంలో ఆయనతోపాటు జగన్ కు తనకూ మధ్య జరిగిన సంభాషణను తాజాగా పంచుకున్నారు కోటంరెడ్డి! ఇందులో భాగంగా... తాను, విజయసాయిరెడ్డి కలిసి అప్పట్లో ఓ సారి జగన్ ను కలిసామని.. ఒక్క రాజ్యసభ సీటు కోసం ఇంతమందితో మాట్లాడాలా అంటూ తేలిగ్గా మాట్లాడారని అన్నారు.
నాడు సాయిరెడ్డికి రాజ్యసభ సీటు కోసం సాయిరెడ్డి మద్రాసులోని ఇళ్లు అమ్మేసారు.. ఆ డబ్బులను జగన్ వైసీపీ నెతలకు ఇప్పించారు.. పోటీ లేకుండా చేయడం కోసం తాను వెంకయ్యనాయుడితో మాట్లాడాను అని చెప్పిన శ్రీధర్ రెడ్డి.. ఇదే విషయాన్ని జగన్ కు చెబితే... ఒక్క సీటు కోసం ఇంత చేయాలా అనంట్లుగా రియాక్ట్ అయ్యారని అన్నారు.
అనంతరం జగన్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయసాయిరెడ్డి... బయటకు వచ్చి కారులో కుర్చున్నాక, బూతులు తిట్టారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మనం ఇంత కష్టపడుతుంటే... అంత అవసరమా అని అంటాడేమిటంటూ ఫైర్ అయ్యారని తెలిపారు. తాను జగన్ కోసం ఎంతో చేశానని.. ఎంతో రిస్క్ చేశానని.. అలాంటి తనకు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ సాయిరెడ్డి తిట్టుకున్నట్లు కోటంరెడ్డి తెలిపారు.
దీంతో... ఇప్పుడు ఈ విషయం అటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, ప్రధానంగా వైసీపీలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. మరి దీనిపై సాయిరెడ్డి ఏమైనా వివరణ ఇస్తారా.. లేక, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిందే కన్ఫాం చేసేసుకోమంటారా అనేది వేచి చూడాలి!