'కేసీఆర్ ను కలిసిన ముఖ్యమంత్రులంతా నెక్స్ట్ మాజీలే'!
ఈ ఎన్నికల్లో డకౌట్ తో హ్యాట్రిక్ కొట్టిందనే కామెంట్లు సొంతం చేసుకుంది. ఈ సమయంలో కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 1 స్థానంలో లీడ్ లో ఉండగా.. ఇప్పటికే 47 స్థానాల్లో విజయం కన్ ఫాం చేసుకుంది. దీంతో... సుమారు 26 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతోంది.
మరోపక్క వరుసగా మూడుసార్లు హస్తిన ప్రజలను పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ 21 స్థానాల్లో విజయం ఖాయం చేసుకోగా 1 స్థానంలో లీడ్ లో ఉంది. దాదాపు ఇవే ఫలితాలు ఫైనల్ అవ్వొచ్చు. మరోపక్క 2015, 2020లలో డకౌట్ అయిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో డకౌట్ తో హ్యాట్రిక్ కొట్టిందనే కామెంట్లు సొంతం చేసుకుంది. ఈ సమయంలో కేటీఆర్ ట్వీట్ చేశారు.
అవును... ఢిల్లీ ఫలితాలపై కేటీఆర్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా.. భారతదేశంలో మోడీకి అత్యంత నమ్మకస్తుడైన కార్యకర్త ఎవరైనా ఉంటే.. అది రాహుల్ గాంధీనే అంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోతో పాటు "మరోసారి బీజేపీ విజయాన్ని నిర్ధారించినందుకు రాహుల్ గాంధీకి అభినందనలు" అని రాసుకొచ్చారు.
ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీంతో... కాంగ్రెస్ నేతలు కేటీఆర్, కేసీఆర్ లపై ఉమ్మడిగా సెటైర్లు వేస్తూ ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా... ప్రియమైన కేటీఆర్ అంటు స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... తాము కాంగ్రెస్ పార్టీ యోధులం అని.. ఎప్పుడు పోరాడుతూనే ఉంటామని.. తెలంగాణలో మాదిరిగానే తిరిగి పుంజుకుంటామని అన్నారు.
ఇదే సమయంలో... "పార్లమెంట్ ఎన్నికల్లో మీ సొంత పార్టీని సున్నా సీట్లు అందించి, తెలంగాణలో బీజేపీకి మాత్రం 8 ఎంపీ సీట్లు బహుమతిగా ఇవ్వడం వంటి అద్భుతమైన విజయానికి మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము.. ఈ సందర్భంగా... రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల క్రెడిట్ కు ఎవరైనా అర్హుడు ఉంటే.. అది మీరే.. కంగ్రాట్స్" అని కౌంటర్ వేశారు.
మరోపక్క... అరవింద్ కేజ్రీవాల్, బీఆరెస్స్ చీఫ్ కేసీఆర్ ను కలవడం వల్లే ఓడిపోయారని కాంగ్రెస్ నేతలు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా... గతంలో సీఎం లుగా ఉన్నప్పుడు కేటీఆర్ ను కలిసిన నేతలు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాజీలుగా మారిపోయారంటూ పలు ఫోటోలు పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా... "మనం చెయ్యి కలిపితే మామూలుగా ఉండదుగా.. ఏపీలో వైఎస్ జగన్, ఒడిశాలో నవీన్ పట్నాయక్, మహారాష్ట్రలో థాక్రే, ఢిల్లీలో కేజ్రీవాల్" అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీంతో... ఢిల్లీ ఎన్నికల ఫలితాల వేళ నెట్టింట ఆసక్తికర చర్చ మొదలైంది.