కేటీయార్ కి ప్రమాదం...బీయారెస్ లో ఆందోళన

ఇదిలా ఉంటే ఇపుడు ఆయన కుమారుడు మంత్రి కేటీయార్ విషయంలో అయితే అలాగే జరిగింది

Update: 2023-11-09 13:23 GMT

బీయారెస్ అగ్ర నేతలకు వరసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలనే ముఖ్యమంత్రి కేసీయార్ హెలికాప్టర్ కి సాంకేతిక లోపం సందర్భంగా ముందే గురించి సిబ్బంది అప్రమత్రం అయ్యారు. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేదని అంతా అనుకున్నారు కేసీయార్ ని క్షేమంగా హెలికాప్టర్ లో వ్యవసాయ క్షేత్రంలో ల్యాండ్ చేశారు. ఆ తరువాత ఆయన వేరే విధంగా సభలకు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే ఇపుడు ఆయన కుమారుడు మంత్రి కేటీయార్ విషయంలో అయితే అలాగే జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ర్యాలీలో మంత్రి కేటీఆర్ స్వల్ప ప్రమాదంతోనే బయటపడ్డారు. ఆయన ఈ రోజు ఆర్మూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలు దేరిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. నామినేషన్ వాహనం నుంచి కేటీఆర్ ముందుకు పడ్డారు.

దాని కంటే ముందు కేటీయార్ జీవన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి అంతా కలసి ప్రచార వాహనం మీద ర్యాలీగా ముందుకు సాగారు. అయితే సడెన్ గా ప్రచార రధానికి డ్రైవర్ బేకులు వేయడంతో అంతా తూలి ముందు పడ్డారు. రెయిలింగ్ రాడ్ ఊడిపోవడం వల్లనే ఇలా జరిగింది అని అంటున్నారు.

కేటీయార్ ముందు వాహనం బోనెట్ మీద బొక్క బోర్లా పడిపోగా ఆయనను సెక్యూరిటీ సిబ్బంది రక్షించారు. అయితే రెయిలింగ్ రాడ్ ఆయన కడుపులో గుచ్చుకుని స్వల్ప ప్రమాదం జరిగింది అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేటీయార్ కి పెద్ద ప్రమాదం జరగకుండా గన్ మ్యాన్ కాపాడారు. ఇక కేటీయార్ కి అటూ ఇటూ ఉన్న జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డి అయితే ఏకంగా వాహనం మీద నుంచి జారి రోడ్డు మీదకు పడిపోయారు.

దాంతో వారికి కూడా గాయాలు అయ్యారని అంటున్నారు. అయితే తాను క్షేమంగా ఉన్నాను అని కేటీయార్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని కూడా చెప్పుకొచ్చారు. మరో వైపు చూస్తే బీయారెస్ అభ్యర్ధి అయిన బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి జరిగింది.

ఇలా వరసబెట్టి చూస్తే రోజుకో సంఘటన రోజుకో అప శకునంగా ఉందని బీయారెస్ లో ఆందోళన సాగుతోంది. వీటికి తోడు కేసీయార్ కేటీయార్ ఇద్దరూ టంగ్ స్లిప్ అయి ఓటమి గురించి మాట్లాడుతున్నారు. ఒక ఇంటర్వూలో కేటీయార్ ఇంటికి వెళ్ళి కూర్చుటామనేశారు. దాని కంటే ముందు కేసీయార్ అదే మాట వాడారు.

దీంతో ఒక వైపు జోష్ లేకపోగా ఇలాంటి మాటలు ఏంటి అని కూడా బీయారెస్ లో వినిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఏమి జరుగుతుందో అన్న బెంగ కలవరం అయితే బీయారెస్ శ్రేణులలో ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News