తెలంగాణలో టీడీపీ బలపడితే... కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!

అవును... ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ... తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై ఆసక్తికర కామెంట్లు చేశారు.

Update: 2024-07-10 04:08 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీడీపీ... ఇప్పుడు తెలంగాణపైనా దృష్టిపెట్టినట్లు చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే... ప్రస్తుతం తెలంగాణలో ఆ పార్టీకి అధ్యక్షుడు లేకపోయినా, అచేతన స్థితిలో ఉందని ఎవరైనా చెప్పినా... కేడర్ మాత్రం అలానే ఉందని, పైగా ఏపీలో ఘన విజయం సాధించిన అనంతరం మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇక నాయకుల విషయానికొస్తే... ఇప్పుడు తెలంగాణలో టాప్ ప్లేస్ లో ఉన్న మెజారిటీ నాయకులు మాజీ టీడీపీ నేతలే! వీరంతా రాజకీయంగా తాము ఏపార్టీలో ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రత్యేకం చూపిస్తారని చెబుతుంటారు. నాటి ప్రత్యేక పరిస్థితుల వల్ల టీడీపీని వీడాల్సి వచ్చింది తప్ప.. అంతకు మించి టీడీపీపైనా, చంద్రబాబుపైనా తమకు ఎలాంటి వ్యతిరేకతా లేదనేది వారి మాట!!

ఇలా తెలంగాణలో గ్రౌండ్ లెవెల్ లో ఇప్పటికీ పసుపు జెండాను రెపరెప లాండించే కార్యకర్తలు, నేతలు ఉన్నారని అంటున్న నేపథ్యంలో... తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో బీఆరెస్స్ సోషల్ మీడియా జనాల నుంచి వస్తోన్న కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే... ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఆసక్తికరంగా స్పందించారు.

అవును... ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ... తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇందులో భాగంగా... తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తే అది తమకే లాభం అని అన్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తానని చంద్రబాబు చెబితే తప్పేముందని ప్రశ్నించారు.

ఇదే సమయంలో... చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేలో కీలకంగా ఉన్నారని చెప్పిన కేటీఆర్... రెండు తెలుగు రాష్ట్రాలకూ ఎక్కువ నిధులు తేవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ విధంగా తెలంగాణకు మేలు జరగడంలో ఆయన పాత్ర ఉపయోగపడితే స్వాగతిస్తామని అన్నారు. ఈ క్రమంలోనే... ఏపీలో తాము బీఆరెస్స్ పెట్టినప్పుడు, తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పడంలో తప్పులేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News