ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ ఘాటు రియాక్షన్... కామెంట్స్ వైరల్!

ఈ సమయంలో ఈ హాట్ టాపిక్ పై బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇందులో భాగంగా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అంతర్జాతీయ కుంభకోణం జరిగినట్లు చూస్తున్నారని అన్నారు.

Update: 2024-03-27 12:27 GMT

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులు అరెస్ట్ కావడంతో.. ఈ వ్యవహారం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ప్రణీత్ రావు అరెస్ట్ తో మొదలైన ఈ వ్యవహారంలో.. ఇటీవల ఇద్దరు అదనపు ఎస్పీలు కూడా అరెస్ట్ అవ్వడంతో మరింత చర్చనీయాంశం అవుతోంది. ఈ సమయంలో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.

అవును... తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారుల అరెస్ట్ తో పాటూ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మరికొంతమందికి నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో... ప్రస్తుతం అమెరికాలో ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.

ఈ సమయంలో ఈ హాట్ టాపిక్ పై బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇందులో భాగంగా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అంతర్జాతీయ కుంభకోణం జరిగినట్లు చూస్తున్నారని అన్నారు. ఎన్నికల వేళ ప్రజా సమస్యల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో పదిలక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశారంటూ లీకులు ఇస్తూ ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని నిప్పులు చేరిగారు.

ఇదే సమయంలో... పెన్షన్లు, రైతుబంధుతో పాటు మరికొన్ని సమస్యలను పక్కదోవ పట్టించేందుకే ఇదంతా చేస్తున్నట్లు చెప్పిన కేటీఆర్... ప్రభుత్వంలో ఉన్నది రేవంత్ రెడ్డే కాబట్టి.. లీకులు ఆపి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. వారికి చేతనైంది చేసుకోవాలని.. ఫోన్ ట్యాపింగ్ పేరు చెప్పి బీఆరెస్స్ నేతలను భయపెట్టాలనుకుంటే అది రేవంత్ భ్రమ అని కేటీఆర్ తెలిపారు.

ఇదే క్రమంలో... ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైనా విచారణ ఎవరైనా చేయొద్దన్నారా అని ప్రశ్నించారు కేటీఆర్. కచ్చితంగా... తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు తప్పు చేశారు అనే విషయాలను బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని, వెంట్రుక కూడా పీకలేరని సవాల్ విసిరారు. ఇలాంటి వారిని బీఆరెస్స్ నేతలెవరూ ఆగం కావొద్దని కేటీఆర్ సూచించారు.

Tags:    

Similar News