నువ్వు పప్పు.. కాదు, నువ్వే గన్నేరు పప్పు: కేటీఆర్ వర్సెస్ రేవంత్
తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన పక్షాలై న బీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి.
తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన పక్షాలై న బీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బీఆర్ ఎస్ నాయకుడు, మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి.. ఆలిండియా ముద్దపప్పు రాహుల్ గాంధీ" అని కేటీఆర్ వ్యాఖ్యా నించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి.
ఆ వెంటనే రియాక్ట్ అయిన రేవంత్‌రెడ్డి.. కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "నేను కందిపప్పు లాంటి వాణ్ని.. కందిపప్పు ఆరోగ్యానికి మంచిది. కానీ, కేటీఆర్ గన్నేరు పప్పు. గన్నేరు పప్పు తింటే ఎలాంటి వారైనా చస్తారు. ఆరోగ్యం బాగుండాలంటే కందిపప్పు, ముద్దపప్పును తీసుకోండి.. గన్నేరు పప్పును కాదు " అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇరు పార్టీల ముఖ్య నాయకుల మధ్య చోటు చేసుకున్న ఈ పప్పు వ్యాఖ్యలు నెటిజన్లను నవ్విస్తున్నాయి.
ఇదిలావుంటే.. తెలంగాణ ఎన్నికల్లో మరోసారి సెంటిమెంటును నిద్రలేపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తు న్నారని.. రేవంత్‌రెడ్డి విమర్శించారు. 2018లో చంద్రబాబు రూపంలో కేసీఆర్ సెంటిమెంటును లేవనెత్తి అధికారంలోకి వచ్చారని చెప్పారు. ఇప్పుడు కూడా ఏదో ఒక రూపంలో సెంటిమెంటును రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ పదేళ్ల పాలో కేసీఆర్ గుడ్ విల్ సున్నా అని రేవంత్ చెప్పారు. బీఆర్‌ఎస్ కూటమి, కాంగ్రెస్ కూటమి మధ్యే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.