రింగ్ నుంచి రాజకీయం..నాడు రెజ్లర్..నేడు అమెరికా విద్యా మంత్రి

అమెరికా విద్యా శాఖ మంత్రిగా మాజీ ప్రొఫెషనల్‌ రెజ్లర్‌ లిండా మెక్ మాన్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.

Update: 2024-11-20 19:30 GMT

అమెరికా అంటే అగ్ర రాజ్యమే కాదు.. చదువుల స్వర్గం కూడా.. డాలర్ డ్రీమ్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను నుంచి ఆ దేశానికి వెళ్లే వారెందరో..? మరి అలాంటి దేశానికి ఏకంగా విద్యా శాఖ మంత్రి అంటే ఎంత కీలకమో చెప్పేదేముంది..? పైగా ఆ మంత్రి నేపథ్యం విభిన్నంగా ఉంటే ఇంకెంత ఆసక్తికరం కానుంది..?

బరిని వీడి రాజకీయాల్లోకి

అమెరికా విద్యా శాఖ మంత్రిగా మాజీ ప్రొఫెషనల్‌ రెజ్లర్‌ లిండా మెక్ మాన్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్తగా ఏర్పడే రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో లిండాకు ఈ పదవి దక్కింది. ఇంతకూ ఎవరీ లిండా అంటే..? ట్రంప్ నకు అత్యంత సన్నిహితురాలు. పైగా వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య మాజీ సీఈవో కూడా. అయితే, ఇదంతా కీలక పదవి అంటే.. తొలుత దీనిని అపర కుబేరుడు ఎలాన్ మస్క్ తొలగించాలని కోరారు. మస్క్‌ నేతృత్వంలోని డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ బృందం ఎప్పటినుంచో కోరుతోంది. తనకు ఎన్నికల్లో సాయంచేసిన ట్రంప్ మాటను కాదని లిండాకు శాఖ అప్పజప్పారు.

భర్తతో కలిసి రెజ్లింగ్ ను పైకిలేపి..

లిండా భర్త విన్స్‌ మెక్‌మాన్‌. ఆయనతో కలిసి రెజ్లింగ్‌ కు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తీసుకురావడంలో లిండా కీలక పాత్ర పోషించారు. అమెరికా పాప్‌ సంస్కృతికి ప్రధాన కేంద్రంగా నిలిచే ‘డబ్ల్యూడబ్ల్యూఈ’ వీరి కంపెనీనే. 15 ఏళ్ల కిందటే లిండా ఈ కంపెనీ సీఈవో పదవి నుంచి దిగిపోయి రాజకీయాల్లోకి వచ్చారు. 2010, 12లో కనెక్టిట్ నుంచి సెనెట్‌ కు పోటీ చేసి ఓడినా రిపబ్లికన్‌ పార్టీ విధేయతను వదులుకోలేదు. ప్రభావవంతమైన విరాళాల దాతగా నిలిచారు. 2016లో ట్రంప్‌నకు మద్దతుగా 6 మిలియన్‌ డాలర్లు సమకూర్చారు.

లిండా కు విద్యపై ఆసక్తి ఎక్కువ. అందుకే ట్రంప్ ఆమెకు ఆ శాఖ ఇచ్చారు. లిండా ఒకప్పుడు టీచర్‌ కావాలని కలలుగన్నారు. పెళ్లి తర్వాత అది సాధ్యంకాలేదు. 2009లో కనెక్టికట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యూకేషన్‌లో సభ్యురాలిగా ఏడాది పనిచేశారు. సేక్రెడ్‌ హార్ట్‌ యూనివర్శిటీ ట్రస్ట్‌ బోర్డులో సభ్యురాలిగా కూడా ఉన్నారు.ట్రంప్‌ తొలి విడత పాలన విభాగంలో ఆమె స్మాల్‌ బిజినెసెస్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ అధిపతిగా పనిచేశారు.

Tags:    

Similar News