ఏపీలో హైడ్రా చర్చ... లోకేష్ నుంచి రియాక్షన్ వచ్చేసింది!

ఈ సమయంలో హైడ్రాపై ప్రజల నుంచి పలు ప్రశంసలు అందుతున్నాయని అంటున్నారు.

Update: 2024-08-31 05:36 GMT

గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ "హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)" వ్యవహారం తీర్వ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలు, ఎఫ్.టీ.ఎల్. పరిధిలోని కట్టడాలపై హైడ్రా విరుచుకుపడుతుంది.

ఈ సమయంలో హైడ్రాపై ప్రజల నుంచి పలు ప్రశంసలు అందుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. పైగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆ డిపార్ట్మెంట్ కు బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించడంతోపాటు.. ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ కూడా మంజూరుకు అనుమతి ఇచ్చిన పరిస్థితి!

దీంతో... ప్రకృతిని, సహజ సంపదను కాపాడే విధంగా ఏపీలో కూడా హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటుపై చర్చ మొదలైంది. ఇటీవల విశాఖలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఏపీలో హైడ్రా అవసరాన్ని ప్రస్థావించారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించారు.

అవును... తెలంగాణలో హైడ్రా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో... ఏపీలో జరిగినట్లు చెబుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ఈ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మీడియా ఇదే విషయాన్ని లోకేష్ వద్ద ప్రస్థావించింది.

ఈ సందర్భంగా స్పందించిన మంత్రి లోకేష్... తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని.. వాటితో ఏపీకి ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా లోకేష్ తెలిపారు. ఇదే సమయంలో ఏపీలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం పరిశీలిస్తుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా... ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేసిన మంత్రి... ఇప్పటికే మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, మైనింగ్ కుంభకోణంతో పాటు మరికొన్ని వ్యవహారాలపై ఇప్పటికి పనులు మొదలయ్యాయన్నట్లుగా తెలిపారు. ఇదే సమయంలో... అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ చర్యలు తీసుకుంటుందని లోకేష్ తెలిపారు.

Tags:    

Similar News