ఆ విషయంలో మోడీకి లోకేష్ క్షమాపణలు... తెరపైకి కీలక వ్యాఖ్యలు!

ప్రధానంగా టీడీపీ ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ నిలబడటంలో కీలక భూమిక పోషిస్తోంది!

Update: 2024-10-15 09:49 GMT

ప్రస్తుతం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, ఇటు కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా టీడీపీ ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ నిలబడటంలో కీలక భూమిక పోషిస్తోంది! ఆ సంగతి అలా ఉంటే.. మోడీకి అన్ కండిషనల్ గా తమ మద్దతు ఉంటుందని చెబుతున్న లోకేష్.. ఆయనకు క్షమాపణలు చెప్పినట్లు చెప్పిన విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిన రాష్ట్రాల్లో కంటే ఏపీలో ఎన్డీయే కూటమి వార్ వన్ సైడ్ అన్నట్లుగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. కేంద్రంలో కూటమికి ఎమ్మెల్యే స్థానాలకంటే ఎంపీ స్థానాలపైనే మక్కువ ఎక్కువని అంటుంటారు! ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటను లోకేష్ నెరవేర్చుకోలేకపోవడంతో.. ప్రధాని నరేంద్ర మోడీకి క్షమాపణలు చెప్పారంట.

ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 25 సీట్లకు గానూ 22 స్థానాల్లో గెలుస్తామని తాను ప్రధాని మోడీకి మాట ఇచ్చానని మంత్రి నారా లోకేష్ వెళ్లడించారు. అయితే... 21 స్థానాల్లోనే గెలిచి, ఒక్కసీటు తగ్గినందుకు తాను మోడీకి క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీయేకు, మోడీకి తమ నుంచి అన్ కండిషనల్ సపోర్ట్ ఉంటుందని అన్నారు.

దేశంలో తొలి ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థే లక్ష్యం!:

దేశ రాజధాని ఢిల్లీలో యాపిల్ ఇండియా ఎండీ విరాట్ భాటియా సంధానకర్తగా వ్యవహరించిన యూఎస్-ఇండో స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం నిర్వహించిన లీడర్ షిప్ సమ్మిట్ ను ఉద్దేశించి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా... మిగిలిన రాష్ట్రాల కంటే వేగంగా పనిచేస్తామని.. పెట్టుబడిదారులకు వేగంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు.

ఇదే సమయంలో.. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినవారందరితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, ప్రతీ వారం వారికి అప్ డేట్స్ అందిస్తున్నట్లు తెల్లిపారు. దీనికోసం ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును పునరుద్ధరించినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే... ఏపీని దేశంలో తొలి ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News