కాంగ్రెస్ లోకి మదన్ రెడ్డి.. బీఆర్ఎస్ ఖాళీ అవుతోందా?
బీఆర్ఎస్ కు షాకులు తగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి చాలా మంది పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు.
బీఆర్ఎస్ కు షాకులు తగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి చాలా మంది పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. గతంలో కూడా ఇలాగే కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది నేతలు బీఆర్ఎస్ లో చేరినట్లు ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. దీంతో బీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు. ఆనాడు తమదే సరైన పార్టీ అని ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితిని విమర్శిస్తోంది.
తాజాగా మరో వికెట్ పడబోతోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత, కేసీఆర్ కు సన్నిహితుడు, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో బీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేపోతున్నాయి. సొంత పార్టీ నేతలు ఇలా క్యూ కట్టడం వారిని వేధిస్తోంది. రానురాను పార్టీ మొత్తం ఖాళీ అయ్యేపరిస్థితి ఉందని తెగ బాధపడుతున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. కానీ అందుకు సరైన మార్గమేంటని ఆరా తీస్తున్నారు.
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారని పార్టీ వర్గాల భోగట్టా. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెదక్ సీటు ఇస్తామని చెప్పి ఇప్పుడు వెంకట్రామిరెడ్డికి ఇవ్వడంతో కినుక వహించిన మదన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తరువాత మొత్తం ఖాళీ అవుతుందంటున్నారు. పార్టీలో ముఖ్య నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీంతోనే బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు దిగజారిపోతోంది. కాంగ్రెస్ లో చేరితో కనీసం నామినేటెడ్ పోస్టులైనా వస్తాయని చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారని అంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ లో కి వెళ్లాలని నిర్ణయించున్న నేపథ్యంలో పార్టీ నేత్లో భయం పట్టుకుంది. వారిని వెళ్లకుండా చేయడంలో వారికి ఆత్మస్థైర్యం నింపాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ తోనే భవిష్యత్ ఉందని చెప్పేందుకు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిలో ధైర్యం నింపాలని చూస్తున్నారు. దీని కోసం పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా బీఆర్ఎస్ నేతల అంతర్మథనం కొనసాగుతోంది.