అద్దంలో నగ్నంగా చూడొచ్చనే బెమ... వృద్ధుడి సరదా తీరిపోయింది!
ఆ మిర్రర్ కు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని.. దానితో మనుషులను నగ్నంగా చూడొచ్చని.. భవిష్యత్తును కూడా అంచనా వేయవచ్చని చెప్పారు.
గతంలో ఒకప్పుడు మాయా కల్లద్దాలు ఉన్నాయని.. వాటితో చూస్తే అవతలి వ్యక్తి నగ్నంగా కనిపిస్తారని రకరకాల మాయ గాసిప్ లు హల్ చల్ చేసేవి! ఇదే సమయంలో అలాంటి యాప్ లు కూడా ఆన్ లైన్ లో తెగ హల్ చల్ చేస్తుంటాయి. అయితే అది మోసం అని తెలిసి కూడా చాలా మంది బోర్లా పడుతుంటారు.
అవతలి వ్యక్తిని నగ్నంగా చూడవచ్చు అనే కళ్లద్దాలు ఉన్నాయని.. అలాంటి అద్ధాలు ఉన్నాయనే మోసాలు నిత్యం జరుగుతుంటాయని అంటుంటారు. అయితే ఈ సమయంలో ఒక వృద్ధుడు ఈ తరహా మోసానికి బలయ్యాడు. మనుషులను నగ్నంగా చూడొచ్చనే మాటలకు లొంగిపోయాడు.
అవును... "మాయా అద్దం"తో మనుషులను నగ్నంగా చూడొచ్చంటూ చెప్పుకు తిరిగిన ముగ్గురు దుండగులు చేతిలో 72 ఏళ్ల వృద్ధుడు మోసపోయాడు. అనంతరం జ్ఞానమో స్పృహో తెచ్చుకుని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అవినాశ్ కుమార్ (72) వద్దకు పార్థ సింగ్రే, మొలయా సర్కార్, సుదీప్తా సిన్హారాయ్ లు వెళ్లారు. తాము పురాతన వస్తువులను సేకరించే ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నారు. తమ వద్ద ఓ "మ్యాజిక్ మిర్రర్" (మాయా అద్దం) ఉందని తెలిపారు.
ఆ మిర్రర్ కు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని.. దానితో మనుషులను నగ్నంగా చూడొచ్చని.. భవిష్యత్తును కూడా అంచనా వేయవచ్చని చెప్పారు. ఇదే సమయంలో రూ.2 కోట్ల విలువైన ఈ అద్దాన్ని కేవలం రూ.9 లక్షలకే విక్రయిస్తామని ఆశ చూపారు. అయితే అవినాశ్ కుమార్ తొలుత ఈ విషయమై సందేహం వ్యక్తం చేశాడు.
అయినా కూడా నిందితులు తగ్గలేదు. ఈ అద్దాన్ని అమెరికా నాసా శాస్త్రవేత్తలు సహా అనేక మంది ఉపయోగించారంటూ నమ్మకం కలిగించారు. దీంతో బెమపడిన అవినాశ్ కుమార్... ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్లి అక్కడ రూ.9 లక్షలు చెల్లించి.. ఆ మ్యాజిక్ మిర్రర్ ను కొన్నాడు.
అయితే ఇంటికొచ్చి చూసుకుంటే అసలు విషయం అర్ధమైంది. అదంతా మోసమని తెలుసుకున్నాడు. అనంతరం తేరుకుని... పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పశ్చిమ బెంగాల్ లో అదుపులోకి తీసుకున్నారు.