మంత్రివర్గం నుంచి సురేఖ బర్త్ రఫ్ పై టీపీసీసీ చీఫ్ క్లారిటీ!

సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపైనా, నటి సమంతపైనా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-11 12:26 GMT

సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపైనా, నటి సమంతపైనా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అటు రాజకీయ, ఇటు సినిమా రంగాల్లోనూ తీవ్ర కలకలం రేపాయి. వీటిపై ఇప్పటికే అటు నాగార్జున, ఇటు కేటీఆర్ లు ఇప్పటికే కోర్టుని ఆశ్రయించారు.

మరోపక్క ఈ వ్యవహారంపై కొండా సురేఖకు వ్యతిరేకంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, నెటిజన్లు స్పందించారు. గౌరవనీయమైన మంత్రి పదవిలో ఉండి ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఏమిటి అని ఒకరంటే.. సినిమావాళ్లంటే అంత లోకువా అని మరొకరు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తాజాగా టీపీసీసీ చీఫ్ స్పందించారు.

అవును... నాగార్జున కుటుంబంపైనా, సమంత పైనా కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. ఈ మేరకు ఇప్పటికే న్యాయస్థానం.. మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. ఈ సమయంలో సురేఖను మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేస్తున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలో స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ వెనక్కి తీసుకున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై తాజాగా మీడియతో మాట్లాడిన ఆయన... సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు.

ఇదే సమయంలో సురేఖ చేసిన కామెంట్ల విషయంలో అధిష్టాణం ఎటువంటి వివరణా అడగలేదని.. ఆమె చేసిన కామెంట్లు ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని.. పైగా చేసిన వ్యాఖ్యలను ఆమె వెనక్కి తీసుకున్నారని మహేష్ కుమార్ పేర్కొన్నారు. కేటీఆర్ తీరు వల్లే ఆమె అలా కామెంట్ చేశారని.. అయినా సురేఖ అలా అని ఉండకూడదని అభిప్రాయపడ్డారు.

ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలపైనా స్పందించిన టీపీసీసీ చీఫ్... అలాంటివారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాను బీఆరెస్స్ దుర్వినియోగం చేస్తుందని.. తాము ఏనాడూ అలా చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక భావితరాల కోసమే హైడ్రాను తీసుకొచ్చామని వెల్లడించారు.

Tags:    

Similar News