వైసీపీ ఎన్నికల ఖర్చు రూ.328 కోట్లు... ఏ మీడియా సంస్థకి ఎంతంటే..?

ఇందులో భాగంగా... మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల కోసం రూ.328 కోట్లు ఖర్చు చేసినట్లు వైఎస్సార్సీపీ నివేదికలో వెల్లడించింది.

Update: 2024-10-11 12:20 GMT

ఈ ఏడాది మే నెలలో జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ ఎంత ఖర్చు చేసిందనే విషయాన్ని వైఎస్సార్సీపీ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. ఇందులో భాగంగా... మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల కోసం రూ.328 కోట్లు ఖర్చు చేసినట్లు వైఎస్సార్సీపీ నివేదికలో వెల్లడించింది.

అవును... ఈ ఏడాదిలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం తమ పార్టీ రూ.328 కోట్లు ఖర్చు చేసిందంటూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ).. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. మార్చి 16 నుంచి జూన్ 6 వరకూ చేసిన ఖర్చుల లెక్కలు అన్నీ ఎన్నికల కమిషన్ కు సమర్పించింది.

ఇందులో ఎన్నికల ప్రచార ఖర్చుతో పాటు అభ్యర్థుల కోసం చేసిన ఖర్చును కూడా పోందుపరిచినట్లు వెల్లడించింది! ఇది మొత్తం రూ.328 కోట్ల 36 లక్షల 60 వేల 46 రూపాయలని వివరించింది. ఇందులో ఎవరికి ఎంత, ఏ విభాగానికి ఎంత మేర ఖర్చు చేశారనే విషయాన్ని నివేదికలో సవివరంగా వెల్లడించింది.

ఇందులో భాగంగా... జగన్ హెలీకాప్టర్, బస్సుల కోసం రూ.21.41 కోట్లు ఖర్చు చేయగా.. స్టార్ క్యాంపయినర్ల ప్రయాణాల కోసం రూ.21.42 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్, వెబ్ సైట్, టీవీ ఛానల్స్ లో పార్టీ ప్రచారం తో పాటు బల్క్ ఎస్సెమ్మెస్ ల కోసం రూ.87.36 కోట్లు ఖర్చు పెట్టినట్లు పేర్కొంది.

వీటిలో ప్రధానంగా... టీవీ9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రై.లి. కు 16.51 కోట్లు.. సాక్షి టీవీ మాతృ సంస్థ ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ కు 12 కోట్లు.. గూగుల్ ఇండియాకు 8.26 కోట్లు.. ఎన్ టీవీ మాతృ సంస్థ రచనా టెలివిజన్ ప్రై. లి. కు 7.08 కోట్లు.. స్టార్ ఇండియా ప్రై. లి. 6.99 కోట్లు.. వైసీపీ అత్యధికంగా చెల్లించిన టాప్ 5 మీడియా సంస్థలు!!

కాగా... ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో మే నెలలో జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదలవ్వగా... ఈ ఎన్నికల ప్రక్రియ జూన్ 6న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ అన్ని రోజుల్లో చేసిన ఖర్చు వివరాలను వైసీపీ ఈసీకి సమర్పించింది.

Tags:    

Similar News