మల్లారెడ్డి నోట గోవా మాట... కాంగ్రెస్‌ లోకి మరో బీఆరెస్స్ నేత అంట!

అవును... తనదైన వ్యాఖ్యలతో ఆన్ లైన్ లోనూ, ఆఫ్ లైన్ లోనూ తన మాటలు హల్ చల్ చేసేలా మాట్లాడుతుంటారు మల్లారెడ్డి

Update: 2024-02-09 16:52 GMT

పూలమ్మినా.. పాలమ్మినా.. అంటూ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిన మాజీమంత్రి మల్లారెడ్డి ఏ విషయాన్ని అయినా ఓపెన్ గా మాట్లాడతారని అంటుంటారు. కావాలనే అంటారో.. లేక, మరెవరికైనా ఈ విషయంలో హింట్ ఇవ్వడమో, హెచ్చరిక చేయడమో చేస్తారో తెలియదు కానీ... చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం కాస్త అటు ఇటూగా పబ్లిక్ లోకి వెళ్లేలా చెప్పేస్తారు! ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో చిట్ చాట్ లో భాగంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు కొన్ని, సంచలన వ్యాఖ్యలు మరికొన్ని చేశారు.

అవును... తనదైన వ్యాఖ్యలతో ఆన్ లైన్ లోనూ, ఆఫ్ లైన్ లోనూ తన మాటలు హల్ చల్ చేసేలా మాట్లాడుతుంటారు మల్లారెడ్డి. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ లోకి పలువురు బీఆరెస్స్ కీలక నేతల జంపింగులతో పాటు తన పొలిటికల్ ఫ్యూచర్, అదిపోతే చేసేపనిపై మల్లారెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. మీడియా ప్రతినిధులతో చిట్‌ చాట్ సందర్భంగా తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ కాస్త ఆసక్తి, మరికాస్త సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా త్వరలో జరగనున్న త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై స్పందించిన మల్లారెడ్డి... మల్కాజిగిరి బీఆరెస్స్ ఎంపీ టికెట్ తన కుమారుడికి ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదేసమయంలో... ఇప్పటికే దాదాపుగా టికెట్ కన్ ఫాం అయిపోయిందని అన్నారు. అక్కడితో ఆగని ఆయన... తమను కాదని పోటీ చేసేంత శక్తి కానీ, సామర్థ్యం కానీ ఎవరికీ లేదంటూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక బీఆరెస్స్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తన భార్యతో కలిసి వెళ్లి రేవంత్ రెడ్డిని కలవడంపైనా మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే ఆయన కాంగ్రెస్‌ లో చేరేందుకు సిద్ధమయ్యారని అన్నారు. అయితే... ఇప్పటికే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌ లోకి వెళ్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం ఉందని స్పష్టం చేశారు. దీంతో.. మరో బీఆరెస్స్ ఎంపీ కాంగ్రెస్‌ లో చేరబోతున్నారన్న క్లారిటీ ఇచ్చినట్లయ్యిందని అంటున్నారు.

ఇదంతా ఒకెత్తు అయితే... తాను ఎమ్మెల్యేగా ఉండగా, తన కుమారుడిగి ఎంపీ టికెట్ ఆశించటం వల్లమళ్లీ వారసత్వ రాజకీయాల అంశం తెరమీదికి వస్తుందన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించిన మల్లారెడ్డి... కేసీఆర్ కుటుంబంలో ముగ్గురు పదవుల్లో ఉన్నారని.. అలా చూసుకుంటే వాళ్ల తర్వాత తన కుటుంబంలోనే ఎక్కువ మంది పదవుల్లో ఉన్నట్టువుతుంది కదా అన్నట్లుగా చమత్కరించడం గమనార్హం!

ఇదే సమయంలో తనకు తెలంగాణలో కాలేజీలు ఉన్నట్లే గోవాలోనూ హోటల్ ఉందనే విషయాన్ని వెళ్లడించిన మల్లారెడ్డి... రాజకీయాల నుంచి తప్పుకుంటే అక్కడకు వెళ్లి ఎంజాయ్ చేస్తానని.. ఉన్నది ఒకటే జీవితం అని.. దాన్ని ఎంజాయ్ చేయాలని హితబోద చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు!!

Tags:    

Similar News