అటవీ ప్రాంతంలో 'మ్యాన్ ఈటర్' మృతి... చంపింది ఎవరు?

కేరళలోని వయనాడ్ లో మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ (45) అనే మహిళపై పెద్దపులి దాడి చేసిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-27 11:30 GMT

కేరళలోని వయనాడ్ లో మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ (45) అనే మహిళపై పెద్దపులి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ఆ మృతదేహంలో కొంత భాగాన్ని తినేసింది. ఇదే సమయంలో ఓ అటవీశాఖ అధికారిపైనా దాడి చేసింది. ఇలా వరుస దాడులకు పాల్పడుతుండటంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

దీంతో.. ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. మహిళపై దాడి చేసిన చంపేసిన పులిని "మ్యాన్ ఈటర్"గా ప్రకటించింది. అది ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. అనూహ్యంగా ఆ పెద్దపులి కళేబారాన్ని అటవీ ప్రాంతంలో గుర్తించారు అటవీశాఖ అధికారులు.

అవును... వయనాడ్ జిల్లాలో ఇటీవల రాధ అనే మహిళపై దాడి చేసి చంపేసిన పులిని అక్కడి ప్రభుత్వం "మ్యాన్ ఈటర్"గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆ పులి మృతి చెందినట్లు అటవీశాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా... సోమవారం తెల్లవారుజామున పులి కళేబరాన్ని అటవీ ప్రాంతంలో గుర్తించినట్లు తెలిపింది.

ఈ సమయంలో... ఆ పులి శరీరంపై గాయాలు ఉన్నాయని.. వాటి ఆధారంగా మరో క్రూర మృగం దాడిలోనే అది మరణించి ఉంటుందని అనుమానిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తానికి ఆ పులిని చంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. ఆదివారమే దాన్ని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశామని తెలిపారు.

ఈ క్రమంలోనే అదివారం మధ్యాహ్నం ప్రాంతంలో పులి ఉనికిని గుర్తించామని.. అయితే సోమవారం తెల్లవారుజామున దాని కళేబారం గాయాలతో లభ్యమయ్యిందని అన్నారు. దీంతో మ్యాన్ ఈటర్ గా ప్రభుత్వం ప్రకటించిన పెద్దపులి కథ సమాప్తమైందని అంటున్నారు.

Tags:    

Similar News